అన్వేషించండి

Mahabubabad Railway Station: రూ.26.49 కోట్లతో మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు

Amrit Bharat Scheme | కేంద్ర ప్రభుత్వం రూ.26.49 కోట్లతో మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్ చేస్తోంది. త్వరలోనే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు కిషన్ రెడ్డి.

Mahabubabad Railway Station | మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంతో దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధి చూస్తే ఇది రైల్వేస్టేషనా, లేక విమానాశ్రయమా అనే తరహాలో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అందుకోసం కొన్ని రోజులపాటు రైల్వేస్టేషన్లకు కొన్ని రైళ్లను దారిమళ్లించడం లాంటివి చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్, బేగంపేట, కరీంనగర్, మహబూబాబ్ రైల్వే స్టేషన్లను అమృత్‌భారత్‌ పథకం కింద  కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

త్వరలోనే మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి రానుంది. రూ.26.49 కోట్ల వ్యయంతో చేపట్టిన మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభించనున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, వెయిటింగ్‌హాల్‌ పనులు, కవర్ ఓవర్ ప్లాట్‌ఫాం పనులు పూర్తయ్యాయని తెలిపారు.


Mahabubabad Railway Station: రూ.26.49 కోట్లతో మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు

ఓవరాల్ గా చూస్తే 92 శాతం మేర పని పూర్తయిందని, అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమవుతోందన్నారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ ఫొటోల్ని కిషన్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తగిన నిధులు అందించి రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


Mahabubabad Railway Station: రూ.26.49 కోట్లతో మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు

అసలేంటీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్
దేశంలోని రైల్వేస్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దీర్ఘకాలిక ప్రణాళికనే ఈ 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' అని చెప్పవదచ్చు. ఈ పథకం కింద దేశంలోని కొన్ని రైల్వేస్టేషన్లను ఎంపిక చేసి దశలవారీగా ఒక్కో స్టేషన్‌కు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి, పునరాభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో కంటే రైల్వేస్టేషన్లను మరింత అందంగా, పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండేలా మార్చడమే  దీని లక్ష్యం.

ఈ పథకం ద్వారా రైల్వేస్టేషన్లలో ఏం పనులు చేస్తారు..
రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశం (Entry), నిష్క్రమణ మార్గాల (Exit) మెరుగుదల, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, పరిశుభ్రమైన ప్లాట్‌ఫారమ్‌లు, మరుగుదొడ్లు, రైల్వేస్టేషన్ పైకప్పులు వంటివి పునరుద్ధరిస్తారు.రైల్వే స్టేషన్లకు దగ్గర్లో ఉన్న నగరాలను కలుపుతూ స్టేషన్ బిల్డింగ్ అప్‌గ్రేడ్ చేస్తారు. ఈ రైల్వేస్టేషన్లను బస్సులు, ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం చేస్తారు. అవసరమైన చోట లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉచిత వై-ఫై సదుపాయం, మెరుగైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన రైల్వే స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకం కింద స్థానిక ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించారు. ఫుడ్ కోర్టులు, ఆట స్థలాలు వంటివి ఏర్పాటు చేస్తారు. స్టేషన్ సమీపంలో రోడ్లను వెడల్పు చేయడం, అవసరం లేని నిర్మాణాలు ఉంటే తొలగించడం, ప్రత్యేక పాదచారుల మార్గాలు (Walkers Root), మెరుగైన పార్కింగ్, బెస్ట్ లైటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. 

అంధుల కోసం..
బ్రెయిలీ సంకేతాలు, స్పర్శతో గుర్తించదగిన మార్గాలు, లిఫ్ట్‌లు, ర్యాంప్‌లు వంటి సదుపాయాలతో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
CM Revanth Reddy US Visit: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget