Daily Habits Money Tips: మీ భవిష్యత్తును సురక్షితం చేసే ఈ 5 చిన్న టిప్స్ పాటించాలి
Money Saving Tips in Telugu | చిన్న చిన్న అలవాట్లు మిమ్మల్ని ఆర్థికంగా పటిష్టం చేస్తాయి. తెలివిగా ఖర్చు మాత్రమే కాదు పొదుపు చేయడం కోసం ఈ చిట్కాలు పాటించండి.

ఒక్కోసారి మీకు ఆకస్మికంగా లాభం రావొచ్చు. కానీ మరో నిర్ణయంతో మీకు వచ్చిన డబ్బు పోగొట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఇది తరచుగా చిన్న, స్థిరమైన అలవాట్లతో స్టార్ట్ అవుతుంది. ఈ రోజువారీ అలవాట్లు మీరు డబ్బును నిర్వహించే, నిర్ణయాలు తీసుకునే విధానాన్ని, మీ భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేయాలన్న ఆలోచనలను మారుస్తాయి. మీరు ఆర్థికంగా ఎదగడానికి, మరింత సురక్షితమైన భవిష్యత్తును నిర్మించడానికి సహాయపడే 5 అలవాట్లు ఇవే.
1. మీ రోజువారీ ఖర్చులను ట్రాక్ చేయండి
ఆర్థికంగా తెలివిగా వ్యవహరించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి మీ డబ్బు ఎటు పోతుంది, ఎలా ఖర్చవుతుందో అర్థం చేసుకోవాలి. ప్రజలు సాధారణంగా కాఫీ, స్నాక్స్ లేదా ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్‌ల వంటి వాటిపై చేసే రోజువారీ ఖర్చులను అంతగా పట్టించుకోరు. మొబైల్ యాప్, స్ప్రెడ్‌షీట్ లేదా నోట్‌బుక్ లో ఆ వివరాలు నమోదు చేయాలి. దాంతో డబ్బు వృధా అయ్యే విషయాలను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. మీ వీకెండ్ ఖర్చులను చెక్ చేసుకోవడం ద్వారా మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించవచ్చు. ఆ డబ్బును పొదుపు చేయడం లేదా పెట్టుబడుల వైపు మళ్లించుకోవచ్చు. ఈ అలవాటు మీ ఆర్థిక అవగాహనను పెంచడమే కాకుండా డబ్బుపై క్రమశిక్షణను కొనసాగిస్తుంది.
2. నెలవారీ బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి
స్మార్ట్ మనీ మేనేజ్‌మెంట్ కు బడ్జెట్ సిద్ధం చేసుకోవడం మూలస్తంభం లాంటిది. నెలవారీ బడ్జెట్ ఆదాయాన్ని అవసరాలు, పొదుపు, ఖర్చులకు కేటాయించడానికి అవకాశాన్ని ఇస్తుంది. నెల చివరిలో మీ డబ్బు ఎలా ఖర్చు అయిందో అని ఆలోచించే బదులు, మీ ఆర్థిక అవసరాల గురించి మీకు అవగాహణ ఉంటుంది. మీరు సాధారణ 50-30-20 పద్ధతితో టిప్స్ ప్రారంభించాలి. 50 శాతం అవసరాలకు, 30% మీ లగ్జరీ, 20 శాతం పొదుపు లేదా లోన్స్ చెల్లింపులకు కేటాయించవచ్చు. మీ లైఫ్ స్టైల్ ప్రకారం సర్దుబాటు చేసుకోవాలి. మీ ప్రణాళికను పాటిస్తే ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది, అధిక ఖర్చులను తగ్గిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మీకు ఒక రోడ్‌మ్యాప్‌ను ఇస్తుంది.
3. మీ పొదుపులను ఆటోమేట్ చేయండి
మీరు తెలివిగా నిర్ణయం తీసుకోవడం డబ్బు ఆదా చేయడం సులభం అవుతుంది. ఆటోమేషన్ అనేది మీరు పాటించగల అత్యంత తెలివైన ఆర్థిక అలవాట్లలో ఒకటి. ఇది రోజువారీ క్రమశిక్షణ అవసరం లేకుండా స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. మీ జీతం లేదా ఆదాయం వచ్చిన వెంటనే, మీరు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) లేదా మ్యూచువల్ ఫండ్ SIPకి ఆటోమేటిక్ డిడక్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ విధానం మొదట ఖర్చు చేయడం, తరువాత ఆదా చేయడాన్ని తగ్గిస్తుంది. ఆటోమేషన్‌ను "మీకు ఫస్ట్ పేమెంట్స్"గా భావించాలి.
4. మీ ఖర్చులను పరిమితం చేయండి
మార్కెట్లో కనిపించే ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ ఆఫర్లు, "ఒకటి కొంటే ఒకటి ఉచితం" (one Plus one Offer) వంటి వాటితో నిండిపోయింది. ఇవి మనకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడానికి మనల్ని నెట్టివేస్తాయి. లగ్జరీ కోసం చేసే ఖర్చు ఆ సమయంలో ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ అది క్రమంగా మీ పొదుపులను తగ్గిస్తుంది. దాంతో ఖర్చులు పెరిగిపోయి నెలాఖరులో ఇబ్బంది పడతారు. మీకు నిజంగా అవసరం ఉన్న వస్తువులు, ఉత్పత్తులు కొనడంలో తప్పులేదు. ఇది మీ బడ్జెట్‌కు సరిపోతే కొనండి. కొనుగోలు చేయకపోతే మీరు కొంత డబ్బును ఆదా చేసినట్లే.
5. విద్యపై సమయం, పెట్టుబడి పెట్టాలి
మనీ మేనేజ్‌మెంట్ ఒకేసారి నేర్చుకునే విషయం కాదు. ఆర్థిక ప్రపంచంలో నిరంతరం ఏదో విషయంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మీ చదువు, లేక ఉద్యోగంలో కొత్త స్కిల్స్ కోసం చేసే పెట్టుబడి తరువాత మీకు లాభాలను తెచ్చి పెడుతుంది. పదవీ విరమణ పథకాలలోనైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ చదువు, లేక కెరీర్ కోసం రోజుకు కనీసం 10-15 నిమిషాలు కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా మీకు తెలిసిన ఫైనాన్షియల్ ప్లానర్ ఉంటే వారిని సంప్రదించి మీ మనీ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి.






















