Kavitha Resignation: ఎమ్మెల్సీ పదవికి, BRS పార్టీకి కవిత రాజీనామా.. మొండి దాన్ని అని కామెంట్స్
Kavitha Resignation To MLC post: కల్వకుంట్ల కవిత అన్నంత పని చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Kavitha Resigns to BRS: హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ తనమీద సస్పెన్షన్ వేటు వేయడంతో ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీమానా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. పార్టీ నుంచి సస్పెన్సన్ తరువాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు వల్లే ఎందరో బీఆర్ఎస్ పార్టీని వీడారని ఇప్పటికైనా పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ గమనించాలన్నారు. విజయశాంతి, విజయరామారావు, మైనంపల్లి హన్మంతరావు, ఈటల రాజేందర్ పార్టీని వీడారని చెప్పారు.
అమ్మను కలవలేకపోతున్నాను..
బీసీ బిడ్డలతో, సామాజిక తెలంగాణ కోసం పాటుపడే మేధావులతో, జాగృతి నాయకులు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా అన్నారు. నేను ఏ పార్టీలో చేరడం లేదు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.. నేను మొండి దాన్ని.. ఆత్మస్థైర్యం ఉన్న మనిషిని అన్నారు. ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. మా అమ్మను కలవలేక పోతున్నందుకు బాధగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో నన్ను ఓడించింది హరీష్ రావు..
కేటీఆర్‌ను ఎన్నికల్లో ఓడించేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నించారని.. ఆరడుగుల బుల్లెట్ మీకు గాయం చేయాలని చూసింది. సిరిసిల్లలకు రూ.60 లక్షల రూపాయలు సైతం పంపారు. మరోవైపు సంతోష్ కుమార్ చెప్పులో రాయి.. చెప్పులో జోరిగలా మారాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంతోష్ కు ధనదాహం ఎక్కువని, హరీష్ రావుతో కలిసి మా ఫ్యామిలీపై కుట్రలు చేశారంటూ ఏకిపారేశారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి హరీష్ రావు కారణం. ఇప్పటికైనా మన కుటుంబం మీద జరుగుతున్న కుట్రలను గమనించాలని లేకపోతే మరింత డ్యామేజీ జరుగుతుందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఓడించడానికి హరీష్ రావు ప్రయత్నించారు. నిజామాబాద్‌లో ఎమ్మెల్యేలను మానేజ్ చేసి తనను ఓడించారని కవిత మరో సంచలనానికి తెరతీశారు.

బీఆర్ఎస్ పార్టీని వీడిన కవిత
ఇటీవల కవిత చేస్తున్న సొంత రాజకీయాలు, పార్టీ నేతల మీద ఆమె చేస్తున్న వ్యాఖ్యలతో నిన్న బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం తెలిసిందే. తాజా పరిణామాలతో తీవ్ర ఆవేదన చెందిన కవిత అటు ఎమ్మెల్సీ పదవికి, ఇటు బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించిన కవిత ఈ మేరకు లేఖలు విడుదల చేశారు.
‘ఓసారి విమానంలో కలిసి ప్రయాణం చేసిన సమయంలో హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యారు. హరీష్.. రేవంత్ కాళ్లు పట్టుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ ఫ్యామిలీ మీద హరీష్ రావు కుట్రలు పెరిగాయి. హరీష్ రావు వల్ల పార్టీకి, కేసీఆర్ ఫ్యామిలీకి సైతం నష్టం జరుగుతోంది. ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు నాకు గాయం చేసింది. మీరు చెప్పిన ఆరడుగుల బుల్లెట్ మీకు కూడా ప్రమాదకరం. కేసీఆర్, కేటీఆర్ ల మీద వరుస కేసులు నమోదవుతున్నాయి. హరీష్ మీద ఆరోపణలతోనే విషయం ఆగిపోతుంది. ఇప్పటికైనా గుర్తించాలని’ పార్టీ పెద్దలను కవిత కోరారు.






















