అన్వేషించండి

TVS Arbiter Vs Ather Rizta - స్మార్ట్‌ ఫీచర్లు, డైలీ అప్-డౌన్ కోసం ఏది బెస్ట్ స్కూటర్‌?

Cheapest electric scooter 2025: టీవీఎస్ ఆర్బిటర్ & ఏథర్ రిజ్టా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ధర, ప్రయాణ పరిధి, పనితీరు & ఫీచర్ల పరంగా ఏ స్కూటర్ ఎంచుకోవాలో అర్ధం చేసుకుందాం.

Best Electric Scooter For Daily Use: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇప్పుడు డిమాండ్ మామూలుగా లేదు. టూవీలర్‌ కంపెనీలు, సంప్రదాయ బైక్‌ల తయారీ కన్నా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌ చేయడానికే ఇప్పుడు ఇష్టపడుతున్నాయి. రెండు కొత్త స్కూటర్లు TVS Arbiter & Ather Rizta ఈ రేసులోకి ప్రవేశించాయి. ఈ రెండు టూవీలర్లు రోజువారీ అప్-డౌన్ & అర్బన్ రోడ్లకు మంచి ఆప్షన్లు. 

బడ్జెట్ అనుకూలమైన vs ప్రీమియం ధర 

హైదరాబాద్‌ & విజయవాడలో, టీవీఎస్ ఆర్బిటర్ ప్రారంభ ధర రూ. 99,900 (ఎక్స్-షోరూమ్). ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 1.20 లక్షలు. ఇది, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుకూలమైన ధర ఉన్న & లాంగ్‌ రేంజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా నిలిచింది. బడ్జెట్‌ చూసుకునే కొనుగోలుదారులకు ఇది ఒక బలమైన ఎంపిక.

ఏథర్ రిజ్టా ధర 1.17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై 1.85 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్ & బ్యాటరీ ఎంపికను బట్టి ఈ రేటు మారుతుంది. ప్రీమియం ఫీచర్లు & ఫ్యామిలీ రైడింగ్ అనుభవంపై ఈ స్కూటర్‌ ఫోకస్‌ ఉంటుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ఇ-స్కూటర్ కోరుకుంటే ఆర్బిటర్ ఉత్తమమైనది. ఫ్యామిలీ & హై-టెక్ ఫీచర్లకు రిజ్టా సరైనది.

డిజైన్ ఎలా ఉంది?

TVS ఆర్బిటర్ డిజైన్ సింపుల్‌గా, బాక్సీగా & ఆధునికంగా ఉంటుంది. ఈ బండి బరువు 112 కిలోలు, 14 అంగుళాల ముందు & 12 అంగుళాల వెనుక చక్రాలు, 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ & 845 mm పొడవైన ఫ్లాట్ సీటు నగర ట్రాఫిక్‌లో సౌకర్యవంతంగా ఉంటాయి. ఇది 6 రంగు ఎంపికలలో లభిస్తుంది.

ఏథర్ రిజ్టా ఎక్కువ ప్రీమియం & వైడ్‌ డిజైన్‌తో వస్తుంది. దీని పెద్ద సీటు & ఫ్యామిలీ-ఫ్రెండ్లీ స్టైల్‌ కారణంగా.. వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే కాకుండా కుటుంబం కోసం కూడా ఉపయోగించాలనుకునే వారికి ఈ స్కూటర్‌ మంచిది. ఇది 8 రంగులలో అందుబాటులో ఉంది.

పెర్ఫార్మెన్స్‌

TVS ఆర్బిటర్‌లో 2.5 kW హబ్ మోటార్ ఉంది, ఇది కేవలం 6.8 సెకన్లలో 0-40 కి.మీ/గం. కు వేగాన్ని అందుకుంటుంది & గరిష్టంగా గంటకు 68 కి.మీ. వేగంతో దూసుకువెళ్తుంది. రోజువారీ అప్-డౌన్‌లు & పట్టణ/నగర రోడ్లకు ఇది అనుకూలంగా ఉంటుంది.

ఏథర్ రిజ్టాలో 4.3 kW PMSM మోటార్ ఉంది, ఇది గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది & 22 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని అధిక యాక్సిలరేషన్‌ లాంగ్‌ రైడింగ్స్‌కు & హైవే రైడింగ్స్‌కు బాగా పనికొస్తుంది.

బ్యాటరీ & పరిధి

TVS ఆర్బిటర్ 3.1 kWh ఫిక్స్‌డ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 158 కి.మీ. IDC రేంజ్‌ను ఇస్తుంది. ఈ బ్యాటరీ 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటల 10 నిమిషాలు పడుతుంది. 

Ather రిజ్టా రెండు బ్యాటరీ ఎంపికలతో వచ్చింది. 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌ 123 కి.మీ. రైడింగ్‌ రేంజ్‌ ఇస్తుంది. 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఇది 159 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఇంకా, Rizta Ather Grid నెట్‌వర్క్ నుంచి వేగవంతమైన ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది.

ఫీచర్లు 

TVS ఆర్బిటర్‌లో... క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, హిల్-హోల్డ్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ & 34 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్లు పొందుతారు. 

Ather రిజ్టా మరింత ప్రీమియం టెక్నాలజీతో స్మార్ట్‌గా పని చేస్తుంది. 7 అంగుళాల ఆండ్రాయిడ్ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్, అలెక్సా, వాట్సాప్ ఇంటిగ్రేషన్, స్కిడ్ కంట్రోల్ & 56 లీటర్ల స్పేస్‌ (34 లీటర్లు అండర్-సీట్ + 22 లీటర్ల ఫ్రంక్)ను ఈ టూవీలర్‌ అందిస్తుంది.

పెద్ద సంఖ్యలో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు లేకపోయినా పర్లేదు, తక్కువ ధరలో మంచి స్కూటర్‌ కావాలనుకునే వాళ్లకు TVS ఆర్బిటర్‌ బెటర్‌ ఛాయిస్‌. హైటెక్‌ ఫీచర్లు, అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకునే వాళ్లకు Ather రిజ్టా మంచి ఆప్షన్‌.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget