అన్వేషించండి

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - నెల రోజుల పాటు ఆ 12 ట్రైన్లు రద్దు!

South Central Railway: మెయిన్‌టెనెన్స్ కారణంగా 12 రైళ్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

SCR Cancelled Trains Due To Maintanance Issue: సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway)  ప్రయాణికులకు కీలక సూచన చేసింది. మెయిన్‌టెనెన్స్ పనుల కారణంగా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించింది. రద్దైన రైళ్లలో కాచిగూడ - నిజామాబాద్(07596), నిజామాబాద్ - కాచిగూడ(07593), మేడ్చల్ - లింగంపల్లి(47222), లింగంపల్లి - మేడ్చల్(47225), మేడ్చల్-సికింద్రాబాద్(47235), సికింద్రాబాద్-మేడ్చల్(47236), సికింద్రాబాద్-మేడ్చల్(47236), సికిందద్రాబాద్ -మేడ్చల్(47238) మేడ్చల్-సికింద్రాబాద్(47242), సికింద్రాబాద్-మేడ్చల్(47245), మేడ్చల్-సికింద్రాబాద్(47228), సికింద్రాబాద్-మేడ్చల్ (47229) ట్రైన్లు ఉన్నాయి. వాటిని అక్టోబర్‌ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే కాచిగూడ-మెదక్‌ రైలు(07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది.
 
పండుగలకు స్పెషల్ రైళ్లు

వాస్తవానికి అక్టోబర్‌ నెలంతా పండుగలే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి ఘనంగా నిర్వహిస్తారు. నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు అంతా సొంతూళ్ల బాట పడతారు. దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి తిరుపతికి అక్టోబరు 1వ తేదీ నుంచి నవంబరు 16 తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిమ మధ్య రైల్వే తెలిపింది. అదేవిధంగా కాచిగూడ- సికింద్రాబాద్‌కు ఏడు రైళ్లు, తిరుపతి-కాచిగూడ ఏడు రైళ్లు, సికింద్రాబాద్‌-తిరుపతి 14 సర్వీసులు, తిరుపతి- సికింద్రాబాద్‌ 14 సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు సౌత్ సెంట్రల్ జోన్‌ సీపీఆర్వో శ్రీధర్‌ వెల్లడించారు. అలాగే సికింద్రాబాద్‌-తిరుపతి రైళ్లు జనగామ, వరంగల్‌ మార్గంలో ..కాచిగూడ- తిరుపతి రైళ్లు ఉందానగర్‌, షాద్‌ నగర్‌ , మహబూబ్‌ నగర్‌ , గద్వాల మార్గంలో రాకపోకలు సాగిస్తాయని అధికారులు వివరించారు. 

దసరాకు స్పెషల్ బస్సులు  

దసరా పండుగను దృష్టిలో పెట్టుకోని ఆర్టీసీ  సిద్ధం అవుతుంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా బస్సు సర్వీసులను నడిపేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. విజయవాడలో వచ్చే నెల 3 నుంచి 12 వరకు (అక్టోబర్ 3-12) కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలివచ్చారు. ఈ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావడంతో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. దీని ప్రకారం పండుగకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్ 3 నుంచి 15 వరకు 13 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.

ఏపీలోనూ రైళ్లు రద్దు 

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోనూ కొవ్వూరు, గోదావరి, రాజమహేంద్రవరం, కడియం సెక్షన్‌లలో నాన్ ఇంటర్‌లాకింగ్‌  ప్రక్రియ, ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేస్తుండడతో అక్టోబర్‌ 29, 30 తేదీల్లో పలు ప్రాంతాల నుంచి సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించే 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ ​​పీఆర్‌వో నస్రత్‌ ఎం. విజయవాడ రైల్వే డివిజన్. ఆదివారం రాత్రి సామర్లకోట రైల్వే అధికారులకు మండ్రూప్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న తిరుపతి-విశాఖ (22708) రైలు, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. విశాఖ-తిరుపతి(22707) ఎక్స్‌ప్రెస్, విజయవాడ-విశాఖపట్నం (12718) ఎక్స్‌ప్రెస్, విశాఖ- విజయవాడ (12717) ఎక్స్‌ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ (22702) ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ -1739 ఈ నెల 30న గుంటూరు (17240) ఎక్స్‌ప్రెస్, విజయవాడ-రాజమహేంద్రవరం (07768) రైలు, రాజమహేంద్రవరం-విశాఖ (07466) రైలు, విశాఖ-రాజమహేంద్రవరం (07467) రైలును రద్దు చేశారు. అక్టోబరు 1న విశాఖ-గుంటూరు మధ్య ప్రయాణించే రైలు (17240) రద్దు చేయబడిందని, వివరాల కోసం సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని పీఆర్వో మండ్రూప్కర్ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget