By: ABP Desam | Updated at : 14 Dec 2022 01:08 PM (IST)
పాదయాత్ర సంక్రాంతి తర్వాత ప్రారంభించాలని షర్మిల నిర్ణయం
Sharmila : పాదయాత్ర ను ప్రారంభించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంక్రాంతి తర్వాతే పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ అడుగడుగునా ప్రయత్నం చేస్తున్నారని వై విమర్శలు గుప్పించారు. పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు మరోసారి కేసీఆర్ సర్కార్‌కు మొట్టికాయ వేసిందన్నారు. నిరహార దీక్ష చేస్తుంటే వందల మంది పోలీసులతో కర్ఫ్యు విధించారన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా కేసీఆర్ అధీనంలోకి వెళ్ళిందని ఆరోపించారు. తనను కట్టడి చేసిన పోలీసులపై కేసు పెట్టనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలను, మీడియాను కూడా పార్టీ ఆఫీసుకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ఉనికి కాదని బందిపోట్ల రాష్ట్ర సమితిని పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణని దోచుకున్నది అయిపోయిందని... ఇక దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని అన్నారు. అనారోగ్య కారణం వల్ల సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
తాలిబన్ నాయకులకు అధ్యక్షుడు కేసీఆర్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల ఆదరణ గెలుచుకుంటుందని కేసీఆర్ కి భయం పట్టుకుందని వైఎస్ షర్మిల విమర్శించారు. కేసీఆర్ కి వైఎస్ఆర్టీపీ ప్రత్యామ్నాయం అన్నారు. తెలంగాణలో బలం పుంజుకుంది కాబట్టి ఇప్పుడు ఆపలేకపోతే ఎప్పుడూ ఆపలేం అని కేసీఆర్ కు భయంపట్టుకుందన్నారు. ఇలా మమ్మల్ని ఆపాలని అనుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు మర్యాద ఉండాలన్నారు. కేసీఆర్ ఆ మర్యాదను కాపాడుకోవాలని హితవుపలికారు. పోలీసులను బీఆర్ఎస్ తొత్తుల్లా వాడుకోకండన్నారు. మమ్మల్ని అడ్డుకుంటే పోలీసులపై కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రకారం మాకు హక్కులు ఉన్నాయన్నారు. తన హక్కులను కేసీఆర్ హరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఒక ఆఫ్ఘనిస్తాన్ లా తయారైందన్నారు. ఇక్కడ తాలిబాన్ పాలన కొనసాగుతుందన్నారు. ఈ తాలిబాన్ నాయకులకు అధ్యక్షుడు కేసీఆర్ అంటూ విమర్శలు చేశారు.
పాదయాత్రకు అనుమతి ఇచ్చిన హైకోర్టు
వరంగల్ జిల్లాలో పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ హై కోర్టును షర్మిల ఆశ్రయించారు. పాదయాత్ర కి అనుమతిచ్చేలా వరంగల్ సీపీకి ఆదేశాలు ఇవ్వాలని షర్మిల పిటిషన్‌లో కోరారు. పాదయాత్ర తో పాటు వరంగల్ బహిరంగ సభ కు అనుమతి కోరారు. కోర్ట్ అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా అనుమతి నిరాకరిస్తారని విచారణలో హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ నాయకులు అందరూ పాదయాత్ర కోసం కోర్ట్ లు చుట్టూ తిరుగుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది తెలంగాణ ను తాలిబాన్ ల రాష్ట్రం గా మారుస్తున్నారని షర్మిల వాఖ్యనించారని.. కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా అభ్యంతకర వాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెల్లారు. అయితే రాజ్ భవన్ దగ్గర వాఖ్యలు చేస్తే పాదయాత్ర కు ఎందుకు అనుమతి నిరాకరించారని హై కోర్టు ప్రశ్నింంచింది.
ఏపీలో 6 - తెలంగాణలో 0 ! పేదలకు ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లు ఇంత తక్కువా ?
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
Medaram Mini Jathara 2023: ఘనంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మ మినీ జాతర!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు