అన్వేషించండి
Advertisement
15 July 2024 News Headlines: జులై 15న మీ స్కూల్ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు
15 th July School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
15 th July 2024 News Headlines in Telugu For School Assembly:
1. నేడు మరో శ్వేతపత్రం విడుదల
బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గతప్రభుత్వ హయాంలో ఒక్కో రంగంలో జరిగిన దోపిడీపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ఈరోజు సహజ వనరులపై శ్వేత పత్రం విడుదల చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు నాలుగో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. జగన్ ప్రభుత్వం చేసినసహజ వనరుల దోపిడీ, భూ దందాల పై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.
2. కేసీఆర్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిని రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టుకు వెళ్లగా.. ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
3. నేడు బెంగళూరుకు జగన్
నేడు మాజీ సీఎం జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. వారం రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. కాగా, ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొంటారా? లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్.. ఈనెల 1వ తేదీ వరకు అక్కడే ఉన్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన పులివెందుల, బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు.
4. EPCET వెబ్ ఆప్షన్లకు నేడే లాస్ట్ డేట్
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే EPCET వెబ్ ఆప్షన్ల గడవు నేటి(సోమవారం)తో ముగియనుంది. ఇప్పటివరకు 99,170 మంది అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరుకాగా.. 90 వేలకు పైగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 173 ఇంజనీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లు ఉన్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలో మరో 27,989, కన్వీనర్ కోటాలో 70,307 సీట్లున్నాయి. 19 లోపు సీట్లను కేటాయించనున్నారు.
5. నేడు తెలంగాణలో అతి భారీ వర్షాలు
నేడు తెలంగాణలో ని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఏపీలోని కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
6. రామసేతు కల్పన కాదు.. వాస్తవం
రామసేతు వంతెన కల్పన కాదని.. అక్షర సత్యమని ఇస్రో తెలిపింది. అమెరికా ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి రామసేతు వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ మ్యాప్ ఆధారంగా అది రామసేతు అని కల్పన కాదని ఇస్రో స్పష్టం చేసింది. తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం రామ సేతు 99.98 శాతం నీటిలో మునిగిందని
7. డిసెంబర్‌లోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు?
ఈ ఏడాది డిసెంబర్‌లోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కానుంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు, క్రియాశీల సభ్యత్వ నమోదు సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు జరగనుంది. నవంబర్‌లో మండల, జిల్లా చీఫ్‌లు, డిసెంబర్‌లో రాష్ట్రాధ్యక్షుల ఎంపిక ఉండనుంది. అనంతరం జేపీ నడ్డా స్థానంలో కొత్త చీఫ్ రానున్నట్లు తెలుస్తోంది.
8. ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి ఫొటో విడుదల
పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్ మొదటి ఫోటోను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విడుదల చేసింది. 20 ఏళ్ల మాథ్యూ కు ఇంకా వివాహం కాలేదని ఎఫ్‌బీఐ వెల్లడించింది. మాథ్యూ అద్దాలు ధరించి నవ్వుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
9. యూరో కప్ విజేత స్పెయిన్
హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేస్తూ యూరో కప్ విజేతగా స్పెయిన్ నాలుగోసారి అవతరించింది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 2-1 తేడాతో మట్టికరిపించింది. పోయినేడాది రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లాండ్ ఈసారి కూడా అదే స్థానంతో సరిపెట్టుకుంది. 86వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు మైకెల్ ఒయార్జాబల్ గోల్ కొట్టడంతో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లి యూరో కప్ విజేతగా నిలిచింది.
10. తొలి భారత కెప్టెన్‌గా శుభమన్ గిల్ చరిత్ర
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా దక్కించుకుంది.ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సారధి చరిత్ర సృష్టించింది. విదేశీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో నాలుగు టీ20లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కోల్పోయిన గిల్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జట్టును విజయపథాన నడిపించాడు.
మంచి మాట : కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు- స్వామి వివేకానంద
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement