అన్వేషించండి

Revanth Reddy : ఆటోడ్రైవర్లు, గిగ్ వర్కర్ల సమస్యలపై రేవంత్ రెడ్డి దృష్టి - ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రత్యేక సమావేశం !

CM Revanth Reddy :తెలంగాణ ఆటోడ్రైవర్లు, గిగ్ వర్కర్లతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. వారి సమస్యలు విన్నారు.

 CM Revanth : నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు న్యాయం చేస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు శనివారం ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్విగ్గి, జొమాటో, ఆటో డ్రైవర్లు, గిగ్ ప్లాట్ ఫార్మ్ కిందకు వచ్చే ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్, స్విగ్గి, జోమాటో తదితర కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు పాల్గొన్నారు.  

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోడ్రైవర్లకు కష్టాలు                                     

అయితే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు కల్పించటం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గిగ్ వర్కర్లు సీఎం రేవంత్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 20 వేల గిగ్ వర్కర్లు ఉండగా.. తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎంను కోరినట్టు సమాచారం. రాజస్థాన్ తరహా గిగ్ ప్లాట్ ఫార్మ్ కార్మికుల సంక్షేమ బిల్లు తేవాలని వర్కర్లు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.  

ఆటోడ్రైవర్ల సమస్యలను  పరిష్కారరిస్తామన్న ప్రభుత్వం                                        
 
ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు, ఉబర్, ఓలా సిబ్బంది ఉపాధి కోల్పోయారు. దీంతో వారంత మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టి బస్ భవన్‌ ముట్టడికి యత్నించారు.  ఈ క్రమంలో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు సమావేశమయ్యారు. 

ఆటోడ్రైవర్లు, గిగ్ వర్కర్లకు ఓ పథకం ప్రవేశ పెట్టే అవకాశం                                              

ఆటోడ్రైవర్ల సమస్యలను సానుభూతితో పరిశీలిస్తామని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.  వారి సమస్యలు విన్న సీఎం ఆటో, ఊబర్, ర్యాపిడో, ఓలా వర్కర్ల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి భరోసా కల్పించనున్నారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. కేబినెట్‌తో చర్చించి.. ఆటో డ్రైవర్లకు, గిగ్ వర్కర్లకు ఓ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
CM Revanth Reddy: 'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Embed widget