News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Renuka Chowdary: షర్మిల పాలేరులో పుట్టిందా? ఇక్కడి నుంచి పోటీ చేయడానికి, మరి నేనెవర్ని: రేణుకా చౌదరి వ్యాఖ్యలు

 Renuka Chowdary: వైఎస్ షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా, ఇక్కడి నుంచి పోటీ చేస్తాననడానికి అంటూ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఇలా అడిగేందుకు ట్యాక్స్ ఏం లేదు కదా అంటూ సెటైర్లు వేశారు. 

FOLLOW US: 
Share:

Renuka Chowdary: వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రేణుకా చౌదరీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇన్నాళ్లకు వైఎస్ షర్మిలకు తెలంగాణ కోడలు అనే విషయం గుర్తుకు వచ్చిందా అంటూ కామెంట్లు చేశారు. షర్మిల తెలంగాణ కోడలు అయితే తాను ఖమ్మం జిల్లా ఆడ బిడ్డను అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లలో షర్మిల ఒక్కరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్రంలోని ఏ స్థానం నుంచైనా షర్మిల పోటీ చేస్తానని అడగొచ్చని.. అందుకు ట్యాక్స్ ఏం పడొదు కాబట్టి ఏమైనా చేయచ్చు అంటూ ఎద్దేవా చేశారు. ఆమె ఏమైనా పాలేరులో పుట్టిందా అంటూ రేణుకా చౌదరి ప్రశ్నించారు. పాలేరులో పోటీ చేస్తానని చెప్పడానికి షక్మిల ఎవరు అని మండిపడ్డారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది నిర్ణయించేది అధిష్టానం అంటూ వివరించారు. 

వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల.. రాహుల్, సోనియాను మాత్రమే కలిశారని అన్నారు. వాళ్లు ఇంకా ఏం చెప్పలేదని తెలిపారు. షర్మిల తెలంగాణలో పోటీ చేసే వియంలో అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అయితే వైఎస్సార్టీపీ విలీనాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ వర్గం వ్యతిరేకిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని అంటూ ప్రశ్నించారు. షర్మిల ముందుగా అమరావతి రైతుల గురించి మాట్లాడాలని సూచించారు. ఈక్రమంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయన్నారు. 

ఫైర్ బ్రాండ్ జాడేది..? 

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుపొందిన  ‘ఫైర్ బ్రాండ్’ రేణుకా చౌదరి కూడా రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు విముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. ఆమె కూడా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకోలేదు. 1984లో తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో కాంగ్రెస్‌లో చేరిన ఆమె..  ఇటీవల ఖమ్మం మన్యం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ఊహాగానాలూ వినిపించాయి. కానీ ఆమె కూడా  అసెంబ్లీకి దూరంగానే ఉన్నారు.

బరిలో లేని గీతారెడ్డి..

ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలకనేత అయిన గీతారెడ్డి కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. గతంలో జహీరాబాద్, గజ్వేల్ నుంచి గెలిచిన ఆమె.. వైఎస్ రాజశేఖరరెడ్డి,  రోశయ్య  ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.  2014లో జహీరాబాద్ నుంచి గెలిచిన ఆమె.. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  హైదరాబాద్ లోని కంటోన్మెంట్ నుంచి ఆమె పోటీ చేస్తారని వార్తలు వచ్చినా ఆమె అసలు పోటీలోనే లేరు.

హన్మంతన్న కూడా.. 

కాంగ్రెస్‌లో నాటి ఇందిరాగాంధీ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ వరకూ ఆ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న వి. హనుమంతరావు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఆది నుంచి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని  విమర్శిస్తున్న ఆయన..  గతంలో అంబార్‌పేట్ నియోజకవర్గం నుంచి  పోటీ చేశారు. హైదరాబాద్ వాసులు హన్మంతన్న అని ముద్దుగా పిలుచుకునే ఆయన రాజకీయ జీవితానికి దాదాపు ఎండ్ కార్డ్ పడ్డట్టే.. వీరితో పాటు  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీపీసీసీ ఎఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ జి. నిరంజన్ కూడా  పోటీకి దూరంగా ఉన్నారు. వీరితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు కూడా  తమ వారసులకు టికెట్లు ఇప్పించుకుంటూ  ప్రత్యక్ష రాజకీయాల నుంచి క్రమంగా దూరమవుతున్నారు.

Published at : 04 Sep 2023 10:58 AM (IST) Tags: Renuka Chowdary Telangana Congress Telangana News Telangana Politics YSRTP President Sharmila

ఇవి కూడా చూడండి

Telangana Elections: తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల, మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే?

Telangana Elections: తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల, మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే?

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

K Narayana: వాళ్లవి ముద్దులాట, గుద్దులాట మాత్రమే - తులసి తీర్థం పోసినట్లు పసుపు బోర్డు: నారాయణ

K Narayana: వాళ్లవి ముద్దులాట, గుద్దులాట మాత్రమే - తులసి తీర్థం పోసినట్లు పసుపు బోర్డు: నారాయణ

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

టాప్ స్టోరీస్

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ