అన్వేషించండి

HYDRA Name Hystory: హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీమా? మార్వెల్ విలనా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు నిజం ఇదీ!

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో HYDRA పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు హైడ్రా అంటే హిట్లర్ సైన్యమా? గ్రీకు పురాణాల రాక్షసా? లేక మార్వెల్ సినిమా విలనా? దీని అసలు చరిత్ర తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రేవంత్ మార్వెల్ కల్పిత కథను నిజమైన చరిత్రగా భావించారు.

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు "హైడ్రా".  హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థగా హైడ్రా పేరు అందరికీ తెలుసు. అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

హైడ్రా.. హిట్లర్‌దా? గ్రీకు రాక్షసా? లేక ఇంగ్లీష్ సినిమా కల్పితమా?

రేవంత్ వ్యాఖ్యలతో మొదలైన ఆసక్తికర కథ!

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, "హిట్లర్‌కు ఇష్టమైన పదం హైడ్రా. అతని కోర్ టీమ్ పేరు కూడా హైడ్రానే, అతను అనుకున్న వాళ్లను ఆ టీం హతరమారుస్తుంది. ఆ స్పూర్తితోనే నేను హైడ్రా అని పేరు పెట్టాను"  అని వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ అప్రజాస్వామిక, నియంత వైఖరికి  క్షమాపణలు చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

కానీ ఈ రాజకీయ వివాదం మధ్య అసలు ప్రశ్న మాత్రం మిగిలిపోయింది... అసలు హైడ్రా అంటే ఏమిటి? దానికి సమాధానం తెలుసుకోవాలంటే మనం దాదాపు 2,700 సంవత్సరాల వెనక్కి వెళ్లాలి!

గ్రీకు పురాణాల్లో పుట్టిన రాక్షసి 

హైడ్రా అనే పదానికి మూలం ప్రాచీన గ్రీకు పురాణాలు. గ్రీకు కథల ప్రకారం, "లెర్నా" అనే ప్రాంతంలోని చిత్తడివనాల్లో ఒక భయంకరమైన బహు తలల పాము ఉండేది. అదే హైడ్రా. ఈ రాక్షసి ప్రత్యేకత ఏమిటంటే...ఒక తలను నరికితే రెండు తలలు మళ్లీ పుట్టేవి! అందుకే దాన్ని చంపడం అసాధ్యంగా భావించేవారు. అందుకే "హైడ్రా" అనే పేరు క్రమంగా ఒక ప్రతీకగా మారింది.

Also Read: Hyderabad Future City Legal Immunity: ఫ్యూచర్ సిటీకి పటిష్టమైన చట్టపరమైన రక్షణ - ఎవరొచ్చినా మార్చలేరు - రేవంత్ మాస్టర్ ప్లాన్ !

ఒక సమస్యను అణిచివేస్తే మరిన్ని సమస్యలు రావడం అన్నట్టు..ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక సామెతలా వాడే మాట: "Cut off one head, two more shall take its place."(ఒక తలను నరికితే మరో రెండు తలలు వస్తాయి.) అంటే ఒక సమస్యను పరిష్కరించామనుకునే సరికి అది మరింత పెద్ద రూపంలో తిరిగి రావడం.

అయితే హిట్లర్‌కు హైడ్రాతో సంబంధం ఉందా?

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చరిత్రలో ఎక్కడా హిట్లర్‌కు చెందిన "హైడ్రా" అనే సంస్థ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. హిట్లర్‌కు చెందిన ప్రధాన భద్రతా వ్యవస్థలు ఎస్ఎస్ (SS) ఇది హిట్లర్ అంతరంగిక భద్రతా వ్యవస్థ, గెస్టాపో (Gestapo) ఇది నాజీ పార్టీ ఇంటెలిజెన్స్ వింగ్, ఎస్డీ (SD). వీటిల్లో హైడ్రై అనే సీక్రెట్ నేమ్ కూడా దేనికీ లేదు. "హైడ్రా" అనే హత్యల బృందం లేదా ప్రత్యేక దళం నాజీ పార్టీ చరిత్రలో లేదు. అలాగే "హైడ్రా హిట్లర్‌కు ఇష్టమైన పదం" అని చెప్పడానికి కూడా ఎలాంటి చారిత్రక ఆధారాలు కనిపించలేదు.

మరి నాజీలతో హైడ్రా పేరు ఎందుకు వచ్చిఉంటుంది ?
దానికి కారణం చరిత్ర కాదు... హాలీవుడ్. ముఖ్యంగా మార్వెల్ కామిక్స్ అనే హాస్య కధలు. 1965లో మార్వెల్ రచయితలు స్టాన్ లీ మరియు జాక్ కిర్బీ కలిసి "హైడ్రా" అనే కల్పిత దుష్ట సంస్థను సృష్టించారు. తర్వాత వచ్చిన కథల్లో దాన్ని నాజీ జర్మనీకి చెందిన రహస్య శాస్త్ర విభాగంగా అక్కడక్కడ ప్రస్తావించారు. 

కెప్టెన్ అమెరికా సినిమా విలన్‌గా హైడ్రా :
2011లో వచ్చిన "Captain America: The First Avenger" సినిమా చూసిన వారికి హైడ్రా బాగా గుర్తుంటుంది. అందులో హైడ్రా అనేది నాజీలతో అనుబంధం ఉన్న రహస్య సంస్థ అని చూపిస్తారు కానీ అది కేవలం కల్పిత కధ. దాని నాయకుడు రెడ్ స్కల్. ప్రపంచాన్ని ఆధీనంలోకి తెచ్చే లక్ష్యంతో పనిచేసే ఈ సంస్థ నాజీ జర్మనీ కంటే కూడా శక్తివంతంగా ఎదగాలని ప్రయత్నిస్తుంది. వారి స్లోగనే..  
"Cut off one head, two more shall take its place. Hail Hydra!" ఈ ఒక్క డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా హైడ్రా పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది.

ఎందుకు ఇప్పటికీ హైడ్రా పేరు చలామనిలో ఉంది?

హైడ్రా అనేది కేవలం ఒక పురాణ రాక్షసి కాదు... ఒ ఆలోచనా ధోరణికి సింబల్. కొన్ని సమస్యలు, కొన్ని సంస్థలు, కొన్ని ఉద్యమాలు... వాటిని అణచివేస్తే అవి అంతమవ్వవు, మరింత బలంగా తిరిగి వస్తాయి. అలాంటి పరిస్తితులను ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులు "హైడ్రా ఎఫెక్ట్"గా అభివర్ణిస్తుంటారు. ఉగ్రవాద సంస్థలు, భూగర్భ నెట్‌వర్క్‌లు, తీవ్రవాద భావజాలాలు వంటి వాటిని వివరిస్తూ ఈ ఉపమానాన్ని తరచూ ఉపయోగిస్తారు.

రేవంత్  అసలు కధ తెలియక అపార్థం చేసుకున్నారా? 

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో కనిపిస్తున్న ప్రధాన సమస్య ఏమిటంటే... మార్వెల్ సినిమాల్లో చూపించిన కల్పిత హైడ్రాను, నిజమైన చరిత్రతో కలిపి చెప్పడం. వాస్తవ చరిత్రలో...  హైడ్రా గ్రీకు పురాణాల రాక్షసి, మార్వెల్ కధల్లో అది నాజీలతో అనుబంధం ఉన్న విలన్ సంస్థ. కానీ రెండూ ఒకటే అనేందుకు ఆధారం లేదు. అలా .. హైడ్రా కథ ఒక పురాణ రాక్షసి, తర్వాత అది ఒక నాటకంగా మారింది, ఆ తర్వాత కామిక్స్‌లో విలన్ సంస్థగా రూపాంతరం చెందింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Also Read: CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!

అయితే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... హైడ్రా శక్తి దాని తలల్లో లేదు, తిరిగి పుట్టే సామర్థ్యంలో ఉంది. అందుకే రేవంత్ తెలియక చేప్పినా..  హైడ్రా  వేల ఏళ్ల క్రితం గ్రీకు పురాణాల్లో పుట్టిన ఒక రాక్షసి పేరు, నేడు హైదరాబాద్ రాజకీయాల వరకు వచ్చి చేరింది. అది హిట్లర్ కథ కాదు... హైడ్రా ఒక పురాణం, పాప్ కల్చర్, ఇప్పుడు రేవంత్ ప్రకటనతో అది రాజకీయం ఐంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget