అన్వేషించండి

Bharath Jodo Yatra: తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, పూర్తి షెడ్యూల్ వివరాలివే

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడబెల్లూరులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది.

- తెలంగాణాలో రాహుల్ కవాతు..
- 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజక వర్గాల్లో యాత్ర
- తెలంగానాలో 375 కిలోమీటర్లు నడవనున్న రాహుల్
- 13 కమిటీలతో టిపిసిసి విస్తృత ఏర్పాట్లు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు సాగుతున్న రాహుల్ కవాతు తెలంగాణాలో కాంగ్రెస్ అధికార జోష్ కు ముందడుగు వేయనుంది. నాలుగు రాష్ట్రాలు దాటి 1500 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసుకోబోతున్న భారత్ జోడో తెలంగాణలో కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలవబోతుంది. 

తెలంగాణలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ.. 
కర్ణాటకలోని రాయచూర్ నుండి (23 తేదీన) నేటి ఉదయం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడబెల్లూరులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని గూడబెల్లూరులో రాహుల్ భారత్ జోడో యాత్రను టీపీసీసీ నేతలు స్వాగతించారు. గూడబెల్లూరులో అల్పాహారం అనంతరం మధ్యాహ్నం నుండి యాత్ర కొనసాగిస్తారు. దీపావళి నిమిత్తం మూడు రోజులపాటు అంటే ఈ 24 నుంచి 26వ తేదీ వరకు బ్రేక్ తీసుకుంటున్నారు రాహుల్ గాంధీ. అనంతరం 27 తేదీ ఉదయం గూడబెల్లూరులో యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. 

మక్తల్ చేరుకుని తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న రాహుల్ పాదయాత్ర, ఆపై 12 రోజులపాటు జనజీవన స్రవంతితో ముందుకు సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. 

అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలులో యాత్ర.. 
తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టే పాదయాత్ర, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్ర నగర్, బహుదూర్ పుర, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది. ఇక నాలుగు రాష్ట్రాలను దాటుతూ వచ్చిన రాహుల్ పాదయాత్రలో అతిపెద్దనగరంగా హైదరాబాద్ లో ప్రవేశించనుండగా నగరంలో ఆరాంఘర్, చార్మినార్, మొజాంజాహి మార్కెట్, గాంధి భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట, పెద్ద శంకరం పేట, మద్కూర్ మీదుగా కొనసాగనుంది. 

యాత్రలో మేధావులు, మత పెద్దలు, వివిధ వర్గాలు.. 
రాహుల్ తెలంగాణలో జరిపే యాత్రలో భాగంగా మేధావులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ వర్గాలు, మత పెద్దలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులతో భేటి అవనుండగా కొందరు రాహుల్ తో యాత్రలో పాదం కలిపేందుకు సిద్దమవుతున్నారు. ప్రదానంగా తెలంగాణాలో రాహుల్ యాత్రలో కొన్ని ప్రార్ధనా మందిరాలు, మసీదులు, హిందూ ఆలయాలను సందర్శించనున్నారు. సర్వమత ప్రార్థనలు కూడా చేయనున్నారు.

టీపీసీసీ ఏర్పాట్లు.. 
భారత జాతి సమైక్యతా నినాదంతో తెలంగాణలో అడుగుపెడుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు టీపీసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నర్ సమావేశాలలో కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాలతోపాటు పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విదానాలతోపాటు రూట్ మ్యాప్ పై టీపిసిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలు సారధ్యం వహించనున్న ఈ 10 కమిటీలతో  పాదయాత్ర పొడవునా యాత్రను సమన్వయం చేసుకుంటూ రాహుల్ గాంధితో కలిసి ముందుకు సాగనున్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకు పోతున్న కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, భారత్ జోడో యాత్రను కూడా సమన్వయం చేసుకుంటూ రాహుల్ కవాతును విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు భారీ ఏర్పాట్లతో సిద్దంగా ఉంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chennai Super Kings vs Lucknow Super Giants Highlights | స్టోయినిస్ సూపర్ సెంచరీ..లక్నో ఘన విజయంCM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Embed widget