అన్వేషించండి

PM Modi : అవినీతి పరులను వదిలి పెట్టే ప్రశ్నే లేదు జైల్లో వైస్తాం - ప్రధాని మోదీ వార్నింగ్

PM Modi : అవినీతి పరుల్ని తప్పక జైలుకు పంపిస్తామని ప్రధాని మోదీ అన్నారు. సంగారెడ్డి విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు.

PM Narendra Modi :   మోదీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటేల్‌గూడలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహిరంగ మోడీ ఏమైనా చెబితే చేసి చూపిస్తాడని, ఆర్టికల్ 370(Article 370) రద్దు చేసి మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370పై సినిమా కూడా రూపొందిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్‌ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ   అన్నారు. కుటుంబ పాలన సాగించేవారిలో అభద్రతా భావం ఎక్కువని చెప్పారు. సంగారెడ్డిలో భాజపా (BJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. విదేశాల్లో తెలుగు ప్రజలు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. 

‘‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పాలించాయి. ఆ పార్టీలు ఉన్నచోట ఆయా కుటుంబాలు బాగుపడ్డాయి. దోచుకోవడానికి వారికి ఏమైనా లైసెన్స్‌ ఉందా?
వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నా. కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికీ అన్యాయం జరుగుతోంది. యువతకు అవకాశాలు దొరకడం లేదు. మీ ఆశీర్వాదాలు, నమ్మకాన్ని వృథా కానివ్వను.. ఇది మోదీ గ్యారంటీ. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వను. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. ఆ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుతున్నారు. కుటుంబ పాలకుల అవినీతి దళాన్ని వెలికితీస్తున్నా. దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారని ఆరోపించారు. 
  
ఈ మేరకు విదేశాల్లో చాలామంది తెలుగు వారు ఉన్నారన్న మోడీ.. మన వాళ్లను విదేశాల్లో చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. అయోధ్య(Ayodhya) లో రాముడికి స్వాగతం పలికామని చెప్పారు. రామాలయంపై మోడీ గ్యారంటీ పూర్తి అయిందా.. లేదా? అని ప్రజలను అడిగారు. ఆర్థిక అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభించామంటూ.. ‘ఈ రోజు నేను మీకో గ్యారంటీ ఇస్తున్నా. రాసిపెట్టుకోండి’ అన్నారు. ప్రపంచంలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు. ఈ మాట కూడా నిలబెట్టుకుంటాని, ఇది మోడీ గ్యారంటీ అని చెప్పారు. ఇక రూ.వేల కోట్ల అవినీతిని బయటపెడుతున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారన్నాని, తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కుటుంబ పాలనతో రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని ప్రధాని ఆరోపించారు.
  
అలాగే కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబ పాలన ఉన్న రాష్ట్రాల్లో కుటుంబాలే బాగుపడ్డాయని విమర్శలు చేశారు. మోడీని విమర్శించడమే సిద్ధాంతమపరమైన పోరాటమా? అని విపక్షాలను ప్రశ్నించారు. కొందరికి కుటుంబమే ముఖ్యం.. నాకు దేశం ముఖ్యమని చెప్పారు. కుటుంబ పార్టీలకు ఏమైనా లైసెన్స్ లు ఇచ్చారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ బాగుకోసమే వాళ్ల భాద అని, కుటుంబ వాదులు దేశ రాజకీయాల్లో యువతను ఎదగనీయలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీ అశీర్వాదాలు వృథా కానివ్వను. ఇది మోడీ గ్యారంటీ’ అంటూ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. చివరగా భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని చెప్పిన ప్రధాని.. భారత్ ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలని సూచించారు.
 
ఇక మేమంతా మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు(Telangana People) అంటున్నారని చెప్పారు. రాష్ట్ర యువత కలలను సాకారం చేస్తానని, 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపించామన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలందరికీ అర్థమైందని చెప్పారు. అవినీతిపరులను బీజేపీ అసలే వదిలిపెట్టదని, ఒక్కొక్కిరినీ జైల్లో పెట్టడం ఖాయమన్నారు. ఇక కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని తెలిపారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Embed widget