Police Over Action : సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే రైతులపై జులుం- ఆ పోలీస్ సస్పెన్షన్ - తప్పు దిద్దుకున్నట్లేనా ?
Telangana: రైతుపై దౌర్జన్యం చేసిన పోలీసును సస్పెండ్ చేశారు. రైతుల పట్ల ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రశ్నే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Nirmal News: పోలీసులు రౌడీలతో, సామాన్య ప్రజలతే ఒకేలా వ్యవహరిస్తే సమస్యలు వస్తాయి. పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహిరంచకపోతే వ్యవస్థ మీదనే విమర్శలు వస్తాయి. అలాంటి ఘటనే నిర్మల్ జిల్లా లోజరిగింది.
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఒక వృద్ధ రైతుపై ASI రామచందర్ అనుచితంగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారింది. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఒక వృద్ధ రైతు రెవెన్యూ సదస్సులో తన భూ సమస్యను చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ASI రామచందర్, ఆ రైతును మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా తహశీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు గెంటాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ASI రామచందర్ రైతును బలవంతంగా బయటకు తోస్తున్న దృశ్యాలు కనిపించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఎందుకీ చిన్న చూపు ?
— Ritesh Rathod (@Rathod4BJP) June 4, 2025
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్
భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు లో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ద రైతు పై చేయి చేసుకున్న ఏఎస్సై @TelanganaDGP @Collector_NML
ఇదేనా మీ ప్రజాపాలన @revanth_anumula pic.twitter.com/CjLvLFaiQx
ఉన్నతాధికారులకు తన భూమి సమస్య చెప్పుకునేందుకు వస్తే నన్ను కనికరం లేకుండా పోలీసులు ఈడ్చుకెళ్లారని రైతు ఆవేదన వ్యక్తంచేశారు.
ఎమ్మార్వో ఆఫీసులో నా భూమి సమస్య మీద పోయి మాట్లాడుతుంటే నన్ను పోలీస్ అతను గుంజుకొని పోయి బైట వేశాడు
— Radha Parvathareddy (@radhachinnulu) June 4, 2025
నాకు 90 ఏండ్లు.. నన్ను ఇంత ఘోరంగా చేయడం అవసరమా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ
ఉన్నతాధికారులకు తన భూమి సమస్య… pic.twitter.com/VxsBpO7OZi
రైతుపై ఎస్సై దురుసు ప్రవర్తన అందర్నీ ఆగ్రహానికి గురి చేసింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ASI రామచందర్‌ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. రామచందర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా విచారణకు ఆదేశించారు.
రెవెన్యూ సదస్సుకు వచ్చిన వృద్ధ రైతును బయటికి నెట్టేసిన ASI రాంచందర్ సస్పెన్షన్.
— Telugu Stride (@TeluguStride) June 4, 2025
MRO ఛాంబర్ నుంచి రైతును మెడ పట్టి బయటికి గెంటిన ASI
మంత్రి సీతక్క ఆదేశాలతో ASIను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల.
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో చోటు చేసుకున్న ఘటన.… pic.twitter.com/wlRWIYQSp2
తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది. ఇక్కడ రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు కార్యాలయాలకు వస్తున్నారు. ఇలాంటి రెవిన్యూ సదస్సులలో తన సమస్య చెప్పుకునేందుకు వృద్ధ రైతు వచ్చాడు. అక్కడేం జరిగిందో కానీ ఏఎస్ఐ మాత్రం రైతును అవమానించాడు. దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో ఒక వృద్ధ రైతుపై అనుచితంగా ప్రవర్తించడం ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ సంఘటన పోలీసు అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ సదస్సుల వంటి సామాజిక కార్యక్రమాలలో విధులు నిర్వహించేటప్పుడు ప్రజలతో వ్యవహరించే తీరుపై చర్చకు కారణం అయింది.



















