By: ABP Desam | Updated at : 19 Apr 2023 04:36 PM (IST)
ఔరంగాబాద్ బీఆర్ఎస్ సభకు గ్రౌండ్ కష్టాలు - వేరే స్థలం చూసుకోవాలని పోలీసుల సలహా !
BRS News : మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి నిర్వహించాలనుకున్న ఔరంగాబాద్ సభకు స్థలం సమస్య ఏర్పడింది. ప్రస్తుతం నిర్ణయించిన చోట.. సభకు అనుమతి ఇవ్వలేమని అక్కడి పోలీసులు తేల్చి చెప్పారు. అంఖాస్ మైదానంలో సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. ఏర్పాట్లు ప్రారంభించే ముందు పోలీసుల అనుమతి కోరారు. -భద్రతా కారణాల దృష్ట్యా అంఖాస్ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఔరంగాబాద్ పోలీసులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అదే రోజున వేరే ప్రదేశంలో బహిరంగ సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్-లోహా సభల సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మూడో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంద. రెండు సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్నామని.. ఇప్పుడు మధ్య మహారాష్ట్రపై దృష్టిపెట్టామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కంధార్-లోహా సభ అనంతరం ఔరంగాబాద్‌లో సభ నిర్వహించాలని స్థానిక నాయకులు కేసీఆర్ ను కోరారు. దీంతో ఔరంగాబాద్‌లో మూడో సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బీఆర్‌ఎస్ పార్టీ కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేలకు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఔరంగాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని, మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాడల్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. శంభాజీనగర్‌లో తెలంగాణ పథకాలను వివరించే ఏడు వీడియో స్క్రీన్ ప్రచార రథాలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నేతృత్వంలో ప్రారంభించారు. తెలంగాణ రూపురేఖలు మార్చిన వందలాది స్కీంల విశిష్టతను ఈ డిజిటల్ స్క్రీన్ ప్రచార రథాల ద్వారా మహారాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నారు. ఇటీవల కంధార్-లోహా బహిరంగ సభకు ముందు అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఔరంగాబాద్‌లోనూ అమలు చేస్తున్నారు.
మహారాష్ట్రలో పార్టీకి విస్తృత ఆదరణ లభిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సీట్ల రాజకీయాలతో మహారాష్ట్ర ప్రజలు విసుగుచెందారని . సీఎం కేసీఆర్‌కు మహారాష్ట్ర ప్రజల్లో ఎనలేని క్రేజ్ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. . కేసీఆర్‌లాంటి విజన్ ఉన్న నాయకుడు తమకు కావాలని, బీఆర్‌ఎస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై ఎంతోమంది బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అంటున్నారు. ఔరంగాబాద్ సభ ద్వారా మహారాష్ట్ర ప్రజలకు చేసే దిశానిర్దేశం దేశ రాజకీయాలకు మేలిమలుపుగా ఉంటుందని.. సభకు భారీగా నిర్వహిస్తామని చెబుతున్నారు.
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?