By: ABP Desam | Updated at : 07 Jan 2022 07:29 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
గత మూడు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో నేడు (జనవరి 7) పెట్రోల్ ధర గత ధరతో పోలిస్తే స్థిరంగా రూ.107.69 గా ఉంది. డీజిల్ ధర కూడా అలాగే రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.29 పైసలు పెరిగి రూ.110.03 గా ఉంది. డీజిల్ ధర రూ.0.27 పైసలు పెరిగి రూ.96.32 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.43 పైసలు తగ్గి రూ.110.08గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.40 పైసలు తగ్గి రూ.96.19 గా ఉంది.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.12 పైసలు తగ్గి రూ.109.09 గా ఉంది. డీజిల్ ధర రూ.0.11 పైసలు తగ్గి రూ.95.22గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో స్థిరంగా ధరలు..
తిరుపతిలో ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.111.31 వద్ద ఉంది. ఇక్కడ రూ.0.32 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.29 పైసలు పెరిగి తాజాగా రూ.97.27 కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా జనవరి 7 నాటి ధరల ప్రకారం 79.98 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు
Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది
Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Telangana Budget 2023 Live Updates: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ : మంత్రి హరీష్‌రావు
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్: మంత్రి హరీష్ రావు
Breaking News Live Telugu Updates: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలుతున్న భవనాలు
Telangana Budget 2023 : నేడే తెలంగాణ బడ్జెట్- 3 లక్షల కోట్లు దాటిపోనున్న పద్దు!
Weather Latest Update: నేడు ఈ 13 జిల్లాల్లో అధిక చలి! ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే
BRS Chief KCR : దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు - కేసీఆర్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?