Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం
కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా జనవరి 17 నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది.
![Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం online classes in osmania university till january 30 due to corona effect Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/08/bd477d52dd9a01b7e1878d05d8c39576_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జనవరి 17 నుంచి జనవరి 30వ తేదీ వరకు ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు ఉంటాయని యూనివర్సిటీ తెలిపింది. డిగ్రీ, పీజీ తరగతులు.. ఆన్ లైన్ ఉంటాయని వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
విద్యా సంస్థలకు సెలవులు
ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ విద్యా సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
It has been decided to extend the vacation of all educational institutions in Telangana till 30.1.2022.@SomeshKumarIAS,
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) January 16, 2022
Chief Secretary,
Telangana State.
The State Government extends holidays of all educational institutions until January 30, 2022, considering the pandemic situation and upon several requests of concerned parents.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 16, 2022
Stay Safe Telangana!#MaskUp #GetVaccinated https://t.co/yeQtLpKXbX
Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)