Morning Top News:
తెలంగాణలో ఫామ్ హౌస్ కేసు రచ్చ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ కేసు ఇప్పుడు తెలంగాణలో రచ్చ రేపుతోంది. స్థానికుల సమాచారంతో వెంటనే తనిఖీలు చేశామని పోలీసులు ప్రకటించారు. ఆ తనిఖీల్లో ఫారిన్ లిక్కర్ దొరికిందన్నారు. కానీ డ్రగ్స్ దొరకలేదు. ఆ పార్టీలలో పాల్గొన్న ఓ వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అంతే ఈ వ్యవహారం సంచలనాత్మకం అయింది. అది రేవ్ పార్టీగా ప్రచారం జరిగింది. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. హైప్రోఫైల్ కేసు కావడం .. ఓ వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ రావడం కొత్త మలుపులకు కారణం అయింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కులగణన ప్రక్రియ వేగవంతం: భట్టి
కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు కులగణన ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలిపారు. కులగణనలో తెలంగాణ ఒక మోడల్ కానుందన్న భట్టి.. ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం పట్టం కడుతుందన్నారు. కులగణనపై సామాజిక వేత్తలు, మేధావులతో రాష్ట్ర సచివాలయంలో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఈసారి విద్యుత్ భారం ఉండదు
తెలంగాణ ప్రజలకు ఈఆర్‌సీ శుభవార్త అందించింది. సామాన్యులపై ఎలాంటి విద్యుత్ భారం ఉండబోదని ఈఆర్‌సీ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. 800 యూనిట్లు దాటిన వారిపై స్వల్ప ఛార్జీల పెంపు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిలు సుమారు రూ.25 వేల కోట్లుగా ఉందని.. డిస్కంలు నష్టాలు తగ్గించుకునేందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచించారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మైక్రోసాఫ్ట్ సీఈవోను ఏపీకి రావాలని ఆహ్వానించిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్ మైక్రోసాఫ్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. ఐటీ, స్కిల్‌డెవలప్‌మెంట్‌పై చర్చించారు. ఏపీ రాజధాని అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నామని దీనికి కూడా సహకారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చంద్రబాబు కళ్లల్లో ఆనందం
ఏపీ సీఎం చంద్రబాబు ఆనందంతో పొంగిపోయారు. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థి లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని సీఎంకు అందజేసింది. ఆ చిరుజ్ఞాపికను చూసి చంద్రబాబు ఆనందంతో మురిసిపోయారు. విద్యార్థి లాస్యను అభినందించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
దళపతి విజయ్ కి పవన్ చెపిన విషెష్ లో అంతుందా?
తమిళ రాజకీయాల్లోకి దళపతి విజయ్ తన తమిళ వెట్రి కళగం పార్టీ ద్వారా ఘనమైన అడుగు వేశారు. తొలి ప్లీనరీ ద్వారా బలప్రదర్సన చేశారు. ఆ మానాడులోనే తన పార్టీ భావజాలాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కూడా ఆయనకు విష్ చేశారు. ఈ సందర్భంగా సిద్దులు, యోగాలు పుట్టిన నేల అని తమిళనాడును ప్రస్తావించారు. పవన్ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జగన్ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. 5 ఏళ్ల పాలనలో 9 సార్లు కరెంటు చార్జీల పెంచిన పులివెందుల ఎమ్మెల్యే
జగన్ విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు కోసం ఈఆర్సీని కోరింది జగనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి రాయితీ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖ తెరిచిన ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓ సిలిండర్ రాయితీ మొత్తం రూ.895 కోట్లు విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విధుల్లోకి ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్సర్
కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ బస్సు డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆయన మళ్లీ విధుల్లో చేరారు. మంత్రి
నారా లోకేశ్ చొరవతో లోవరాజు డ్యూటీకి హాజరయ్యారు. బస్సు ముందు డ్రైవర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా.. అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై వచ్చిన ట్వీట్లకు లోకేశ్ స్పందిస్తూ డ్రైవర్ లోవరాజును వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు.
డిజిటల్ అరెస్ట్ పై ప్రధాని మోదీ కీలక సూచనలు
దేశంలో డిజిటల్ అరెస్ట్ పై విస్తృత చర్చ జరుగుతోంది. చాలా మంది దీనికి బాధితులుగా మారుతున్నారు. దీనిపై ప్రధాని మోదీ అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో బాధితురాలికి సైబర్ నేరగాడు చేసిన కాల్ వీడియో, ఆడియోను ప్రధాని మోదీ చూపించారు. ఆ తర్వాత ఈ స్కామ్ గురించి వివరించారు. ముందు వేచి ఉండండి, తర్వాత ఆలోచించండి, ఆ తర్వాత చర్య తీసుకోండి అన్నారు. కొత్త మోసాలను ప్రజలు ఎలా నివారించవచ్చో మోదీ తెలిపారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రాహుల్ అవుట్ , లక్నో కొత్త కెప్టెన్‌గా వచ్చేది అతనేనా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం ఫ్రాంచైజీలు రిటెన్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో కేఎల్ రాహుల్ కు లక్నో మొండిచేయి చూపనుందని దాదాపుగా కన్ఫార్మ్ అయింది. కెప్టెన్సీ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు కానీ నికోలస్ పూరణ్ ఐపీఎల్ 2025లో లక్నో సారథిగా వ్యవహరించనున్నాడని సమాచారం . పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..