అన్వేషించండి

Farm house Case: ఫామ్‌హౌస్ కేసులో రాజకీయం ఎక్కువ -మ్యాటర్ తక్కువ ! మానసిక దాడి చేయడమే వ్యూహమా ?

Hyderabad: పామ్ హౌస్ లిక్కర్ పార్టీ కేసులో రాజకీయమే డామినేట్ చేసింది. అక్కడ ఏమీ జరగకపోయినా ఏదో జరిగినట్లుగా ప్రచారం చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇందులో నిజం ఉంది కూడా !

Politics dominate the Palm House Liquor Party case :  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో కుటుంబసభ్యులతో దిపావళీ పార్టీ చేసుకున్నారు. అక్కడ పెద్ద శబ్దాలు చేస్తున్నారని 100కు ఫోన్  వచ్చిందని వెంటనే తనిఖీలు చేశామని పోలీసులు ప్రకటించారు. ఆ తనిఖీల్లో ఫారిన్ లిక్కర్ దొరికిందన్నారు. కానీ డ్రగ్స్ దొరకలేదు. ఆ పార్టీలలో పాల్గొన్న ఓ వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అంతే ఈ వ్యవహారం సంచలనాత్మకం అయింది. అది రేవ్ పార్టీగా ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం ఆ పదం తమ ఎఫ్ఐఆర్ లో కానీ మరో చోట కానీ వినియోగించలేదు. 

రాజకీయ దుమారం రేగడమే అసలు సమస్య 

ఫామ్ హౌస్‌లలో మందు పార్టీలు చేసుకోవడం కామన్. కుటుంబసభ్యులు, బంధు మిత్రుల పార్టీలు వీకెండ్స్ లో ప్రతి ఫామ్ హౌస్‌లో ఉంటాయని అందరికీ తెలుసు. అక్కడ మద్యం ఉంటుంది. సరదాకి పోకర్ కూడా ఆడుకుంటారు. అలాంటి సెటప్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్గనైజర్లు ఉంటారు. ఇలాంటి పార్టీ రాజ్ పాకాల ఇంట్లో జరుగుతోందని తెలిసి పోలీసులు రెయిడ్ చేశారు. వారు రిలీజ్ చేసిన దృశ్యాల్లో విదేశీ మద్యం బాటిల్స్ తో పాటు కొన్ని పోకర్ కాయిన్స్ కూడా ఉన్నాయి. దాంతో పెద్ద  రేవ్ పార్టీ అనే ప్రచారం జరిగింది. కానీ అక్కడ జరిగింది ఫ్యామిలీ పార్టీ అని  దృశ్యాలు  చూస్తే అర్థమైపోతుంది. కానీ హైప్రోఫైల్ కేసు కావడం .. ఓ వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ రావడం కొత్త మలుపులకు కారణం అయింది. 

సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ ఆయన పేరు ఫేమస్ - రాజ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ పెద్దదే !

రాజ్ పాకాల పారిపోవడంతో మరింత గందరగోళం

జన్వాడ ఫామ్‌హౌస్‌లో లిక్కర్ పార్టీ వ్యవహారంలో రాజ్ పాకాల పోలీసులు వచ్చినప్పుడు ఉన్నారు. ఆయనకు డ్రగ్స్ టెస్టు కూడా చేశారని కేటీఆర్ చెప్పారు. అయితే ఆ తర్వవతా పారిపోవడంతో  చిన్న విషయం  కాస్తా అతి పెద్దదిగా మారినట్లుగా కనిపిస్తోంది. మామూలుగా అది లిక్కర్ పార్టీనే.  అనుమతి లేకుండా మద్యం ఈవెంట్ నిర్వహిస్తున్నారని చిన్న కేసు పెట్టే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఫామ్ హౌస్ ఓనర్, పార్టీ హోస్ట్ రాజ్ పాకాల ఎప్పుడైతే కనిపించకుండా పారిపోయారో అప్పుడు ఇది పెద్ద విషయం అయిపోయింది   పార్టీలో పాల్గొన్న వారికి చేసిన టెస్టుల్లో ఒకరికి కొకైన్ పాజిటివ్‌గా తేలడం.. ఆయన తనకు రాజ్ పాకాలనే కొకైన్ ఇచ్చారని చెప్పడంతో  ఇక మీడియాలోనూ కంట్రోల్ లేకండా వార్తలు వచ్చాయి.  

హైదరాబాద్‌లో ఎలాంటి పార్టీలకు అనుమతి తీసుకోవాలి? ఇంట్లో మందు వేడుక చేసుకున్నా చిక్కులు తప్పవా?

సోదాలకు చాన్స్ ఇచ్చింది రాజ్ పాకాలనే !

రాజ్ పాకాలకు పారిపోయే అవకాశం పోలీసులే ఇచ్చి ట్రాప్ చేశారేమో తెలియదు కానీ ఆయన కనిపించకపోవడంతో ఎక్సైజ్ పోలీసులు ఓరియన్ విల్లాస్ లోని ఆయన ఇంట్లో సోదాలకు ప్రయత్నించారు. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు బద్దలుకొట్టి సోదాలు చేశారు. అదే  విల్లాస్‌లో ఉన్న రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర అలాగే.. కేటీఆర్ విల్లాలోనూ సోదాలు చేశారు.  ఈ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక మొదట బీఆర్ఎస్ తంటాలు పడింది.  అది కేవలం కుటుంబ పార్టీనేనని కుటుంబాలను రోడ్డు మీదకు లాగుతారా వారు ఎంత మొత్తుకున్నా కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టేవరకూ వారి వాదన జనంలోకి వెళ్లలేదు.  రాజ్ పాకాల పారిపోకుండా పోలీసులకు అందుబాటులో ఉన్నట్లయితే ఇంత సంచలనం అయ్యేది కాదన్న వాదన వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై మానసిక దాడి చేయడానికి పక్కాగా ఉపయోగించుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
Supreme Court: ఉపఎన్నికలకు మేం సిద్ధం - సుప్రీంకోర్టు నోటీసులతో కేటీఆర్ కీలక ప్రకటన
ఉపఎన్నికలకు మేం సిద్ధం - సుప్రీంకోర్టు నోటీసులతో కేటీఆర్ కీలక ప్రకటన
Mirai Movie: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
Arasavalli Temple: దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు
దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
Supreme Court: ఉపఎన్నికలకు మేం సిద్ధం - సుప్రీంకోర్టు నోటీసులతో కేటీఆర్ కీలక ప్రకటన
ఉపఎన్నికలకు మేం సిద్ధం - సుప్రీంకోర్టు నోటీసులతో కేటీఆర్ కీలక ప్రకటన
Mirai Movie: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
Arasavalli Temple: దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు
దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు
Martand Sun Temple: కోణార్క్ కంటే 500 ఏళ్ల ముందే కాశ్మీర్ లో అతి పెద్ద సూర్య దేవాలయం.. మార్తాండ సూర్య దేవాలయం
కోణార్క్ కంటే 500 ఏళ్ల ముందే కాశ్మీర్ లో అతి పెద్ద సూర్య దేవాలయం.. మార్తాండ సూర్య దేవాలయం
Crime News: నగ్న వీడియోలు ఉన్నాయంటూ మహిళా టెకీని బెదిరించి రూ.2.5 కోట్లు కాజేసిన కేటుగాడు
నగ్న వీడియోలు ఉన్నాయంటూ మహిళా టెకీని బెదిరించి రూ.2.5 కోట్లు కాజేసిన కేటుగాడు
Next on Netflix: కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Embed widget