Who Is Raj Pakala : సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ ఆయన పేరు ఫేమస్ - రాజ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ పెద్దదే !
Farm House Case : పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ పవర్ ఫుల్. ఆయన కేటీఆర్‌కు బావమరిది. అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి.
Raj Pakala : జన్వాడ పామ్‌హౌస్‌లో జరిగిన లిక్కర్ పార్టీ వ్యవహారంలో ఎక్కువగా వినిపిస్తున్న రాజ్ పాకాల. ఈ కేసులో విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తనకు రాజ్ పాకాలనే కొకైన్ ఇచ్చాడని చెప్పారు. బయటకు వచ్చాక తాను పోలీసులు అలాంటిదేమీ చెప్పలేదని వీడియో రిలీజ్ చేశారు. అది వేరే విషయం. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా NDPA కేసులో రాజ్ పాకాలను A1గా చేర్చి కేసు నమోదు చేశారు. ఆసలు ఈ రాజ్ పాకాల ఎవరు ? ఎందుకింద వివాదాస్పదమవుతున్నారు ?
కేటీఆర్ భార్య శైలిమ సోదరుడు పాకాల రాజేంద్ర ప్రసాద్
కేసీఆర్ వియ్యంకుడు పాకాల హరినాథరావు కుమారుడు పాకాల రాజేంద్రప్రసాద్, ఆయన సోదరుడు పాకాల శైలేంద్ర. వీరి సోదరి కల్వకుంట్ల శైలిమ. కేటీఆర్ సతీమణి. పాకాల రాజేంద్రప్రసాద్‌ను అందరూ షార్ట్ కట్‌లో రాజ్ పాకాల అని పిలుస్తూ ఉంటారు.
హైదరాబాద్‌లో ఎలాంటి పార్టీలకు అనుమతి తీసుకోవాలి? ఇంట్లో మందు వేడుక చేసుకున్నా చిక్కులు తప్పవా?
ఈవెంట్స్ నౌ టిక్కెట్ బుకింగ్స్‌తో పాపులర్
రాజ్ పాకాల సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నారు. ఈటీజీ డిజిటల్ పేరుతో ఆయనకు ఓ సంస్థ ఉంది. ఆ సంస్థకు ఈవెంట్స్ నౌ అనే కంపెనీ కూడా క్లయింట్. ఈ కంపెనీలో పాకాల రాజేంద్రప్రసాద్ కూడా డైరక్టర్ గా ఉన్నారు. ఈవెంట్స్ నౌ ద్వారా నగరాల్లో జరిగే ఈవెంట్స్ టిక్కెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో హైదరాబాద్ లో అనేక ఈవెంట్స్ జరిగాయి. వాటన్నింటికీ ఈవెంట్స్ నౌ ద్వారా టిక్కెట్లు బుకింగ్ జరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సన్ బర్న్ ఫెస్టివల్స్ జరిగాయి . ఇది డ్రగ్స్ పార్టీ అనే ఆరోపణలు బలంగా రావడంతో కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు. హైదరాబాద్లోని కొన్ని సార్లు జరిగాయి. అలాగే హైదరాబాద్‌లోని కొన్ని ప్రముఖ పబ్‌లలో ఆయనకు వాటా ఉందని చెబుతూంటారు.
పలుమార్లు రాజ్ పాకాలపై రేవంత్ ఆరోపణలు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్ పాకాలపై రేవంత్ రెడ్డి చాలా సార్లు ఆరోపణలు చేశారు. ఓ సారి డేటింగ్ యాప్ ను ఆయన నడుపుతున్నారని యువత జీవితాల్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పై డ్రగ్స్ ఆరోపణల్ని కూడా చేశారు. ప్రభుత్వం మారిన తరవాత కూడా ఆయనపై ఓ సారి డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన రూ. వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసి అలాంటి ప్రచారం చేసిన వారందరికీ నోటీసులు జారీ చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిగిందో లేదో స్పష్టత లేదు.
హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు
తాజాగా ఫామ్ హౌస్‌లో లిక్కర్ పార్టీతో మరోసారి హైలెట్
రాజ్ పాకాలకు ప్రధానంగా గుర్తింపు కేటీఆర్ బావమరిది కావడం వల్లనే. ఆయన చేసిన వ్యాపారాలు ఎక్కువ ప్రచారానికి కారణం అయ్యాయని అనుకోవచ్చు . మంచి లావిష్ పార్టీలు ఏర్పాటు చేయడంలో ఆయనది ప్రత్యేక శైలి అంటారు. ఆ క్రమంలో హన్వాడ ఫామ్ హౌస్‌లో దివాళి పార్టీని ఏర్పాటు చేశారని కానీ ఆయన సన్నిహితుడు కొకైన్ పాజిటివ్‌గా తేలడంతో మొత్తం తేడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన అరెస్టును తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.