Tamil Politics Vijay And Pawan: దళపతి విజయ్ రాజకీయ భావజాలం గందరగోళం - పవన్ కల్యాణ్ ఎందుకలా అన్నారు ?
TVK Vijay: సొంత పార్టీ తొలి ప్లీనరీ నిర్వహించిన విజయ్ కు పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు పంపించారు. అయితే విష్ చేశారా - రాజకీయ విధానంలో గందరగోళాన్ని గుర్తు చేశారా ?
Pawan Kalyan And Vijay: దక్షిణాది నుంచి మరో సూపర్ స్టార్ తన రాజకీయ కలల్ని నెరవేర్చుకోవడానికి గ్రాండ్ గా ముందడుగు వేశారు. తమిళ రాజకీయాల్లోకి దళపతి విజయ్ తన తమిళ వెట్రి కళగం పార్టీ ద్వారా ఘనమైన అడుగు వేశారు. తొలి ప్లీనరీ ద్వారా బలప్రదర్సన చేశారు. ఆ మానాడులోనే తన పార్టీ భావజాలాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కూడా ఆయనకు విష్ చేశారు. ఈ సందర్భంగా సిద్దులు, యోగాలు పుట్టిన నేల అని తమిళనాడును ప్రస్తావించారు. ఇది ఆసక్తికరంగా ఉంది. పవన్ ఇలా ట్వీట్ చేయడానికి కారణం విజయ్ ప్రకటించిన తన పార్టీ భావజాలమే కారణం అన్న భావన వినిపిస్తోంది.
తమిళనాడులో అన్ని పార్టీల భావజాలం దాదాపుగా ఒక్కటే !
తమిళనాడులో ఇప్పటి వరకూ ప్రధాన రాజకీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే. పెరియార్, అన్నాదురై భావజాలంతో డీఎంకే ఏర్పాటయింది. తర్వాత కాలంలో ఆ పార్టీలో చీలిక వచ్చి అన్నాడీఎంకే ఏర్పాటయింది. అయితే రెండు పార్టీల భావజాలం ఒక్కటే. ఇందులో ప్రధానంగా హిందీ వ్యతిరేకత ఉంటుంది. కుల వివక్ష ఉంటుంది. అందరూ సమానమే అన్న భావన ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా దేవుడు లేడు అనే భావన ఉంటుంది. ఈ భావజాలాన్నే ప్రధాన పార్టీలు కొనసాగిస్తూ ప్రజల్ని ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఇదే భావజాలాన్ని అనుసరిస్తున్నట్లుగా చెప్పారు. కానీ ఇక్కడ కొద్దిగా మార్పు చేశారు. అదేమిటంటే.. విజయ్ దేవుడు ఉన్నాడు.. ఒక్కరే దేవుడు అంటున్నారు. అక్కడే ట్విస్ట్ వచ్చింది.
'రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ భయపడను' - తమిళ స్టార్ విజయ్ పార్టీ తొలి సభ, దళపతి ఎంట్రీ అదుర్స్
విజయ్ భావజాలంపై తమిళనాట విస్తృత చర్చ
ఒకరే దేవుడు అంటూ విజయ్ ఇచ్చిన స్లోగన్ కాస్త విస్తృత చర్చకు కారణం అవుతోంది. దీనికి కారణం విజయ్ అసలు పేరు జోసఫ్ విజయ్. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించుకున్నారు. మాస్టర్ సినిమా షూటింగ్ కోసం తూత్తుకుడిలో ఉన్నప్పుడు ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో ఆయన తన పేరును జోసఫ్ విజయ్ గా ప్రెస్ నోట్ విడుదల చేశారు. కావాలని ఆయన అలా చేశారని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. అప్పటికీ ఆయన రాజకీయ ఆకాంక్షలు బయటకు రావడంతో అలా చెప్పుకోవడం వెనుక చర్చ జరిగింది. ఇప్పుడు ఒకరే దేవుడు అంటూ ఆయన అందుకున్న విధానం హైలెట్ అవుతోంది. తనకు మార్గదర్శి అని చెప్పుకున్న పెరియార్ .. దేవుడు లేడని బలంగా వాదిస్తారు. కానీ విజయార్ ఈ విషయంలోపెరియార్ ను సైతం పట్టించుకోలేదు.
సిద్దులు, యోగులు పుట్టిన గడ్డ అని పవన్ కల్యాణ్ తన ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. ఒకరే దేవుడని విజయ్ చెప్పడం..దానికి పవన్ ఇచ్చిన రియాక్షన్ వెనుక లోతైన అర్థం ఉందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల తమిళ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తర్వాత అన్నాడీఎంకేకు పదేపదే శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు విజయ్ కూడా భిన్నంగా శుభాకాంక్షలు చెప్పారు. భావజాలం పేరుతో హిందూత్వాన్ని కించపర్చవద్దన్న సందేశాన్ని పవన్ విజయ్‌కు ఒక్క ట్వీట్ ద్వారా ఇచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.