Fake Bomb Threats: విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ - సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్
Fake Calls: విమానయాన సంస్థలకు ఫేక్ బెదిరింపు కాల్స్ ఎక్కువవుతున్న క్రమంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా చూడాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ను హెచ్చరించింది.
Cetral Government Strong Warning To Fake Bomb Threats: విమానయాన సంస్థలకు ఇటీవల బాంబు బెదిరింపులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు (Social Media Platforms) కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తున్నాయని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆదేశాలు ధిక్కరిస్తే థర్డ్ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్ ఫామ్స్ తీసుకునే వెసులుబాటును నిలిపేస్తామని స్పష్టం చేసింది. వివిధ ఎయిర్ లైన్స్‌లకు ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్, వాటి వల్ల నిలిచిన, ఆలస్యమైన విమాన సర్వీసులు, ఇతర కార్యకలాపాలను కేంద్రం ఈ సందర్భంగా ప్రస్తావించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
కాగా, ఇటీవల ఎయిర్ పోర్టులకు, విమానాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా, ఒకే రోజు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. ఎవరైనా తప్పుడు కాల్స్ చేసినట్లుగా గుర్తిస్తే వారిని నో ఫ్లైయింగ్ ప్యాసింజర్స్ లిస్టులో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
'చట్టాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం'
తాజాగా, ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లోనూ (ABP Southern Rising Summit) కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఈ అంశంపై స్పందించారు. 'గత 8, 9 రోజులుగా ఫేక్ కాల్స్ చాలా వస్తూనే ఉన్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Civil Aviation Ministry), హోం మంత్రిత్వ శాఖ, IT మంత్రిత్వ శాఖతో కలిసి, నోడల్ మంత్రిత్వ శాఖలుగా ఉన్నాయి. మేం సంబంధిత చట్టాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. పౌర విమానయానానికి సంబంధించి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై SUSCA చట్టం, విమానాశ్రయాలతో సహా ఇతర నేరాలను కవర్ చేయడానికి అన్ని విధాలుగా విధానాలను రూపొందిస్తున్నాం. పోలీసులు, హోం వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌తో సహా అన్ని సంబంధిత చట్ట అమలు సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి' అని పేర్కొన్నారు. ఇలాంటి కాల్స్ ఆకతాయిలు పాల్పడుతున్నారనే ఎక్కువ మంది నమ్ముతున్నారని అయితే కుట్ర ఉందని చెప్పలేమన్నారు. ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయన్నారు. ప్రయాణికుల భద్రతకు వంద శాతం ప్రాధాన్యతమిస్తామని చెప్పారు.
'మధ్య తరగతికి చేరువగా విమానయానం'
మరోవైపు, ఉడాన్ పథకాన్ని ప్రవేశ పెట్టి పదేళ్లవుతున్నా విమాన ప్రయాణం మధ్య తరగతికి లగ్జరీగా మారిందన్న అంశంపై సదరన్ రామ్మోహన్ భిన్నంగా స్పందించారు. విమానయాన రంగాన్ని మధ్య తరగతికి కూడా అనుకూలంగా ఉండేలా చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
Also Read: Sabarimala Alert: ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు