2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Tech industry layoffs: 2024 టెక్ ఉద్యోగులకు చాలా గడ్డుకాలంగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగల కంపెనీలు వరుసగా లే ఆఫ్స్ ప్రకటిస్తుండటంతో ఉద్యోగుల గుండెల్లో గుబులు రేగుతోంది.
Tech industry layoffs: టెక్ ఇండస్ట్రీ పరిశ్రమ ఊగిసలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మందగమన పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఈ ఏడాది కాస్ట్ కటింగ్ పేరుతో పేరున్న కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత విధించాయి. దాదాపు ఒక లక్ష యాభై వేలమందికిపైగా ఉద్యోగాలను ఈ ఒక్క ఏడాదిలోనే కోల్పోయినట్లు పలు సర్వెల్లో వెల్లడైంది.
బడా కంపెనీల్లో లేఆఫ్స్..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్ కంపెనీల ఎప్పటికప్పుడు తమ కార్యకలపాల్లో మార్పులు చేర్పులు చేసకుంటున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ జెయింట్స్ అయిన టెస్లా, సిస్కో, మైక్రోసాఫ్ట్, సాప్, ఇంటెల్ తదితర సంస్థలు లే ఆఫ్స్ బాట పట్టాయి.
మార్కెట్లోని డిమాండుకు తగిన విధంగా కాస్ట్ కటింగ్ పేరుతో సర్వై కావడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇంటెల్లో భారీగా కోత..
టెక్ దిగ్గజమైన ఇంటెల్లో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దీంతో వచ్చే ఏడాది కల్ల దాదాపు పది బిలియన్ డాలర్ల మేరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ లెక్క గడుతోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా వరుసగా ఎదురవుతున్న నష్టాలతో సతమవుతున్నే ఈ సంస్థ.. రీసెర్చీ, డెవలప్మెంట్, కాపిటల్ ఎక్స్పెండీచర్, మార్కెంటింగ్ డిపార్ట్మెంట్లలో కోత విధించినట్లు తెలుస్తోంది.
టెస్లా కూడా అదే బాట..
విద్యుత్ కార్లతోపాటు సెన్సెషన్ క్రియెట్ చేసిన టెస్లా.. కూడా ప్రస్తుతం కాస్ట్ కటింగ్ బాట పట్టింది. ప్రపంచవ్యాప్తంగా 20 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఉద్యోగులను తొలగించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఈఓ ఎలన్ మస్క్ నుంచి ఆదేశాలు రావడంతో పెద్దమొత్తంలోనే ఉద్యోగులు అటు సీనియర్, ఇటు జూనియర్ లెవల్లో ఇంటిముఖం పట్టారు. మరో నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో.. దాదాపు పదివేల మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ముందస్తుగా 5 శాతం ఉద్యోగులను తొలగించిన సంస్థ.. ఇయర్ ఎండింగ్ లో మరో 7 శాతం మందికి ఉద్వాసన పలికింది.
ఉబెర్లోనూ కోతే..
ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఉబెర్ కూడా రెసిషన్ సెగ గట్టిగానే తగిలింది. కోవిడ్ తర్వాత నుంచి డిమాండ్ కాస్త తగ్గుతూ వస్తున్న క్రమంలో 6,700 మంది ఉద్యోగులను తొలిగించింది. అలాగే ఎస్ఏపీ కూడా కాస్ట్ కటింగ్ చర్యలను ప్రారంభించింది. ఎనిమిది వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
Also Read: AP Jobs: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి
ఇదే బాటలో మైక్రోసాఫ్ట్..
టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్ లోనూ భారీగా ఉద్యోగా్ల్లో కోత పడింది. ప్రపంచవ్యాప్తంగా 2500 మంది ఉద్యోగులను తొలగించింది. యాక్టివిషన్ బ్లిజార్డ్, జెనీమ్యాక్స్, ఎక్స్బాక్స్ తదితర గేమింగ్ డిపార్ట్మెంట్ల నుంచి ఉద్యోగులను తొలగించినట్ల సమాచారం. ముఖ్యంగా సీనియర్ లెవల్లోని ఉద్యోగులను తొలగించడం ద్వారా కాస్త ఆర్థిక భారాన్ని తగ్గించుకున్నట్లు కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక, కరోనా టైంలో జూమ్ అంటూ ఎగిసిన బైజుస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఫైనాన్సియల్ క్రైసిస్ ను తట్టుకోవడం కోసం ఇప్పటికే భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దాదాపు 2500 మంది ఉద్యోగులను ఇంటిముఖం పంపించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా మందగమన పరిస్థితులు క్షీణించి, మళ్లీ గ్లోబల్ గా మార్కెట్లు పుంజుకుంటేనే ఉద్యోగవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.