News
News
వీడియోలు ఆటలు
X

Nizamabad Politics: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత పోటీ హస్తినకా? అసెంబ్లీకా ? బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత పోటీ హస్తినకా... లేక అసెంబ్లీకా... నిజామాబాద్ జిల్లా పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్. ఇటీవల కవిత జిల్లా పర్యటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

FOLLOW US: 
Share:

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు ఎమ్మెల్సీ కవిత. ఆమె నాయకత్వంలో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గత రెండు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారు. మంచి రిజల్ట్ రావటంలో కవిత కృషిచేశారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతారు. కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు రావటంతో జిల్లాకు ఆ మధ్య రావటం తగ్గించారు కవిత. ఇటీవల పార్లమెంట్ పరిధిలో కవిత పర్యటనలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపుతున్నాయి. ఇటీవల జగిత్యాల పర్యటన, నిజామాబాద్ పర్యటనలతో క్యాడర్ ఉత్సహంతో ఉంది. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కీ రోల్ పోషిస్తున్నారు కవిత. పార్టీ బలోపేతానికి తొలి నాళ్ల నుంచి కవిత ఎంతో చేశారు. 

ఇక రాబోయే ఎన్నికల్లో కవిత ఎంపీగానా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నచర్చ జిల్లా బీఆర్ఎస్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది. ఆ మధ్య కవిత అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ కవిత ఇటీవలి కాలంలో అటు జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో పాల్గొనటం... ఇటు నిజామాబాద్ లో పలు కార్యక్రమాల్లో కవిత పాల్గొనటంతో ఇక మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తారన్న చర్చకూడా జరుగుతోంది. అయితే పసుపు బోర్డు హామీతో గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అరవింద్ ఆ హామీ నెరవేర్చలేదు. అరవింద్ హామీ ఏమైందన్నదానిపై ఇటీవల జిల్లాలో పసుపు రంగు ప్లేక్సీలతో పసుపు బోర్డు ఏమైంది ఎంపీగారు అని ప్లేక్సీలు వెలిశాయి.

గత ఎన్నికల్లో కవిత ఓట్లు ఏ మాత్రం తగ్గలేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మాదిరే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చాయి. అయితే 175 మంది నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఇందులో 150 మందికి పైగా పసుపు బోర్డు కోసం రైతులు పోటీ చేశారు. దీంతో కొన్ని ఓట్లు కవితకు మైనస్ అయ్యాయ్. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ అంతగా పట్టించుకోలేరన్న వాదన ఉంది. కొంత కాంగ్రెస్ ఓట్లు చీలటంతో అరవింద్ కు ప్లస్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

కవిత ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశారు. బీడీ కార్మికులకు ఫించన్ ఇప్పించటంతో... సెంట్రల్ ఫండ్స్ నుంచి వికలాంగులకు బ్యాటరీ వెహికిల్స్ ప్రొవైడ్ చేయటం, ఆశా వర్కర్లకు జీతాలు పెంచటంలో కవిత కృషి ఉందని... లక్కంపల్లి సెజ్ కంపెనీలను తీసుకొచ్చారని చెప్పుకుంటారు. పసుపు బోర్డు కోసం కవిత ఎంతో కృషి చేశారు. మహిళల్లో కవితకు మంచి ఆదరణ ఉంది. ఈ పరిస్థితుల్లో కవిత వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్లమెంట్ కు పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. అటు ఎంపీ అరవింద్ కు కూడా కవిత సవాల్ విసిరారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటబడి మరీ ఓడిస్తానని ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్సీ కవిత. మరోవైపు పసుపు బోర్డు హామీ నేరవేర్చటంలో ఎంపీ అరవింద్ విఫలమయ్యారన్న భావన ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాల పసుపు రైతుల్లో ఉంది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గాల ప్రజలు ఇప్పుడు మళ్లీ కవిత వైపే మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం ఉంది. 

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ కవిత పాత్రను దేశ రాజకీయాల్లో వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీగా చేసిన అనుభవం కవిత సొంతం. వివిధ పార్టీ నాయకలకులతో కవితకు మంచి సంబంధాలున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ కూడా కవితను ఎంపీగా మరోసారి పార్లమెంట్ కే పంపేందుకే మొగ్గుచూపుతన్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కవిత ఎంపీగా పోటీ చేసినా ఎమ్మెల్యేగా పోటీ చేసినా... తాము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Published at : 19 May 2023 06:38 PM (IST) Tags: Kavitha Nizamabad Latest News BRS KCR NIZAMABAD

సంబంధిత కథనాలు

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం