అన్వేషించండి

Rekha Naik Quits BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ - పార్టీని వీడిన మరో ఎమ్మెల్యే రేఖా నాయక్

MLA Rekha Naik Resigns to BRS Party: టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీలు మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

Rekha Naik Resigns to BRS Party: 

భారత్‌ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి మరో షాక్ తగిలింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీలు మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్ వీడనున్నారని బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన సమయంలోనే ప్రచారం జరిగింది. తనకు టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తికి లోనైన అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఎట్టకేలకు శుక్రవారం నాడు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. 

కేసీఆర్ పార్టీలో మహిళలకు గౌరవం లేదని ఆరోపించారు. పార్టీ తరఫున వరుస ఎన్నికల్లో గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తా అని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ తరఫున తాను బరిలోకి నిలుస్తానో త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. మరోవైపు రేఖా నాయక్ కు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన సమయంలోనే ఆమె భర్త శ్యామ్‌ నాయక్‌ కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. కేసీఆర్ నుంచి హామీ వస్తుందని ఆశించిన ఆమెకు భంగపాటు తప్పలేదు. దాంతో బీఆర్ఎస్ ను వీడాలని ఆమె నిర్ణయించుకున్నారు.

ఖానాపూర్ నియోజకవర్గానికి ACDP ద్వారా వచ్చే 2.24 కోట్ల నిధులను విడుదల చేయలేదని రేఖా నాయక్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేస్తానని సైతం హెచ్చరించారు. వచ్చే నిధులను ఆపి తనను అణగ తొక్కడనికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ పై తీవ్రస్థాయిలో ఆమె మండిపడ్డారు. తన దగ్గర ఉన్న ఎస్.బి. కానిస్టేబుళ్లను కూడా తీయడం సరికాదని మండిపడ్డారు. ఖానాపూర్ లో మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు కావడానికి నేను ఎంతో కృషి చేశానని చెప్పారు.  నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను రెబల్ గా నైనా, ఇండిపెండెంట్ గా నైనా తప్పక పోటీలో ఉంటానని ఇటీవల చెప్పారు. అభివృద్ధి నేను చేస్తే గొప్పలు వారు వేరే వాళ్లు చెప్పుకోవడం సరికాదన్నారు.

తన భర్త పార్టీ మారారని, తాను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పినా వేధించారని ఎమ్మెల్యే ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తన అల్లుడు ఐపీఎస్ బదిలీపై స్పందిస్తూ రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పని చేశానని, నియోజకవర్గం కోసం కూడా పని చేశానని చెప్పారు.  9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని... అభ్యర్థి కోసం అభివృద్ధిని ఆపడం ఏమిటని ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని ఇలాంటి ధోరణి ఏదైనా ఉంటే ప్రభుత్వం వెంటనే దాన్ని మార్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ రాదని పార్టీకి రాజీనామా చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

No Chicken: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
CM Ramesh Vs Mithun: సీఎం రమేష్ టీడీపీ తరపున మాట్లాడుతున్నాడు - లోక్‌సభలో వైసీపీ ఎంపీ ఆరోపణ - అసలేం జరిగిందంటే?
సీఎం రమేష్ టీడీపీ తరపున మాట్లాడుతున్నాడు - లోక్‌సభలో వైసీపీ ఎంపీ ఆరోపణ - అసలేం జరిగిందంటే?
Rahul Telangana tour cancel :  రాహుల్ తెలంగాణ టూర్ క్యాన్సిలట - అసలు వస్తారని ఎప్పుడు చెప్పారు?
రాహుల్ తెలంగాణ టూర్ క్యాన్సిలట - అసలు వస్తారని ఎప్పుడు చెప్పారు?
Mana Mitra WhatsApp Governance In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
No Chicken: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
CM Ramesh Vs Mithun: సీఎం రమేష్ టీడీపీ తరపున మాట్లాడుతున్నాడు - లోక్‌సభలో వైసీపీ ఎంపీ ఆరోపణ - అసలేం జరిగిందంటే?
సీఎం రమేష్ టీడీపీ తరపున మాట్లాడుతున్నాడు - లోక్‌సభలో వైసీపీ ఎంపీ ఆరోపణ - అసలేం జరిగిందంటే?
Rahul Telangana tour cancel :  రాహుల్ తెలంగాణ టూర్ క్యాన్సిలట - అసలు వస్తారని ఎప్పుడు చెప్పారు?
రాహుల్ తెలంగాణ టూర్ క్యాన్సిలట - అసలు వస్తారని ఎప్పుడు చెప్పారు?
Mana Mitra WhatsApp Governance In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
Manda Krishna On Revanth: మందకృష్ణ యూటర్న్ - రేవంత్‌కు ఓ సోదరుడిగా అండగా ఉంటానని ప్రకటన !
మందకృష్ణ యూటర్న్ - రేవంత్‌కు ఓ సోదరుడిగా అండగా ఉంటానని ప్రకటన !
JEE Main 2025 Results: జేఈఈ మెయిన్‌ 2025 సెషన్-1 ఫలితాలు విడుదల- ఇద్దరు తెలుగు విద్యార్థులకు వందకు వంద
జేఈఈ మెయిన్‌ 2025 సెషన్-1 ఫలితాలు విడుదల- ఇద్దరు తెలుగు విద్యార్థులకు వందకు వంద
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Viral News: వెయ్యి మందితో శృంగారం చేస్తుందట - మగాళ్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంది- కానీ ..
వెయ్యి మందితో శృంగారం చేస్తుందట - మగాళ్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంది- కానీ ..
Embed widget