అన్వేషించండి

Adilabad Bear: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ఎలుగుబంటి స్వైరవిహారం - పట్టుకునేందుకు భారీ ఆపరేషన్

Bear: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఎలుగుబంటి దాడి ఘటన పెను కలకలం రేపుతోంది. ఎలుగుదాడిలో ఒకరు చనిపోయారు.

Bear roaming on Telangana Maharashtra border: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల సరిహద్దుల్లో ఎలుగుబంటి సృష్టించిన బీభత్సం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా దయాల్ ధన్నుర్ గ్రామ శివారులో పొలం పనుల్లో ఉన్న ఎనిమిది మందిపై ఒక ఎలుగుబంటి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ భీకర దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తెలంగాణ సరిహద్దుకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే జరగడంతో అటవీ శాఖ యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది.

తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎలుగుబంటి                                
 
ఎనిమిది మందిపై దాడి చేసి తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ ఎలుగుబంటి, ఇప్పుడు తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖాధికారి  ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ సరిహద్దు గ్రామాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా బోథ్ మండలంలోని నిగిని, మర్లపెల్లి అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరించే అవకాశం ఉన్నందున, ఆ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ప్రయాణికులకు, రైతులకు  జాగ్రత్తలు                       

అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నిగిని గ్రామం నుండి మహారాష్ట్రలోని శివిని పట్టణానికి వెళ్లే రహదారిపై ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఈ మార్గంలో ఎవరూ వెళ్లవద్దని సూచించారు. అలాగే, పశువుల కాపరులు తమ పశువులను మేపడానికి అడవిలోకి తీసుకెళ్లవద్దని, రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఒంటరిగా అటవీ శివారు ప్రాంతాలకు వెళ్లవద్దని ఖరాకండిగా చెప్పారు. మనుషులపై దాడి చేసి రక్తరుచి మరిగిన ఎలుగుబంటి ఎదురుపడితే ప్రాణాపాయం పొంచి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అటవీ శాఖ నిఘా                                 

ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం పహారా కాస్తున్నారు. ఎలుగుబంటి కదలికలను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సమీప గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని, ఏవైనా అసాధారణ శబ్దాలు లేదా కదలికలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. మృగం పట్టుబడే వరకు ప్రజలు గుంపులుగా ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు పాటించాలని డి.ఎఫ్.ఓ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.                                                   

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget