తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ముఖ్యంగా మూసీ సుందరీకరణ, గాంధీ సరోవరం ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నారు.
Gandhi Sarovar Project: ఈ నెలాఖరులో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన! కేంద్రమంత్రులకు రేవంత్ ఆహ్వానం!
Gandhi Sarovar Project: మూసీ నది పునరుజ్జీవనం, గాంధీ సరోవరం ప్రాజెక్టు పనులను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ కార్యక్రమ శంకుస్థాపనకు కేంద్రమంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు.

Telangana Latest News: డిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. మూసీ సుందరీకరణ, గాంధీ సరోవరం ప్రాజెక్టు గురించి వివరిస్తున్నారు. శంకుస్థాపనకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ముందుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా గాంధీ సరోవరం ప్రాజెక్టు ప్రాముఖ్యత వివరించారు. ఈ నెలాఖరున జరిగే భూమిపూజాకార్యక్రమానికి రావాలని పిలిచారు.
ప్రాజెక్టును ప్రతిష్టాత్మంగా తీసుకున్న సీఎం
హైదరాబాద్ నగర జీవనాడి అయిన మూసి నదిని అందంగా తీర్చి దిశగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. దశాబ్దాలుగా మురుగు నీరు, వ్యర్థాలతో నిండిపోయిన మూసీ నదిని ఒక ప్రపంచ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా మార్చడమే లక్షంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు తీర్చి దిద్దాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల కావడంతో, క్షేత్రస్థాయిలో పనులు వేగవతంకానున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం నదిని ఫ్యూరిఫై చేయడమే కాకుండా, హైదరాబాద్ చారిత్రక వారసత్వాన్ని, ఆధునిక అవసరాలను మేళవించేలా ప్రాజెక్టు నిలవనుంది.
మూసి నదిలో మహాత్మాగాంధీ చితాభస్మాన్ని కలిపారని అందుకే ఇక్కడ బాపూఘాట్ నిర్మించాలని తలపెడోతంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే విషయాన్ని కేంద్రమంత్రులకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. దీన్ని ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి మూసీ నది వ్యర్థాలతో నిండిపోయింది. దీనిని పునరుద్ధరించడానికి మొదట నదిలో పూడిక, వ్యర్థాలు తొలగించాలి. తర్వాత నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి వరద ముప్పును తగ్గించాలి. చుట్టూ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, కేవలం మంచినీరు మాత్రమే నదిలోకి వెళ్లేలా చేయాలి. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
భూసేకరణకు నోటిఫికేషన్
మూసీ నది అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా ఉన్న భూ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ భూసేకరణకు సంబంధించిన అధికారిక నోటిఫికేన్ విడుదల చేసింది. హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ మండలం రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం పరిధిలో సుమారు 55ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించారు. భూ నిర్వాసితులకు, పట్టా భూములు ఉన్న వారికి భూ బదలాయింపు హక్కు రూపంలో పరిహారం అందిస్తారు. సరైన రెవెన్యూ పత్రాలు ఉన్న వారికి టీడీఆర్ సర్టిఫికెట్లు అందజేస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా బాపూఘాట్ ప్రాంతాన్ని గాంధీ సరోవర్‌గా అభివద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ల నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి పనులు చేపడతారు. ఫేజ్ 1Aలో హిమాంత్ సాగర్ నుంచి గాంధీ సరోవరం వరకు 9.2 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. ఫేజ్-1Bలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవరం వరకు 11.8 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. మొత్తంగా నదికి ఇరువైపులా కలిపి 21 కిలోమీటర్ల పరిధిలో ఈ సుందరీకరణ పనులు సాగనున్నాయి.
Frequently Asked Questions
తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఎవరిని కలుస్తున్నారు?
మూసీ నదిని ఎలా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది?
మురికి నీరు, వ్యర్థాలతో నిండిపోయిన మూసీ నదిని ప్రపంచ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతోంది.
గాంధీ సరోవరం ప్రాజెక్టు ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు?
మహాత్మాగాంధీ చితాభస్మాన్ని మూసీ నదిలో కలిపిన ప్రాంతంలో బాపూఘాట్ నిర్మించి, దానిని ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూసీ నది అభివృద్ధికి భూసేకరణ ఎలా జరుగుతుంది?
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. భూ నిర్వాసితులకు, పట్టా భూములు ఉన్న వారికి భూ బదలాయింపు హక్కు రూపంలో లేదా టీడీఆర్ సర్టిఫికెట్ల రూపంలో పరిహారం అందిస్తారు.























