అన్వేషించండి

MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం

Komatireddy Rajgopal Reddy | సొంత ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నిధులు మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని ప్రశ్నించారు.

Telangana Assembly Session | హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోందని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ, సాధారణ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. నిధులు మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని బయట టాక్ నడుస్తోందని, నా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఏం తప్పు చేశారు? అధికారంలో ఉండి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతే నేను ఎమ్మెల్యేగా ఉండటం అనవసరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆకలి కోసం కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేశాం..

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల పాటు సాగింది ఆకలి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మగౌరవాన్ని వదులుకోరని ఈ ఉద్యమం నిరూపించింది. నాడు తెలంగాణ గొంతు వినిపించడం కోసం సొంత పార్టీని సైతం ఎదిరించి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కొడంగల్ అభివృద్ధి గురించి, ఉత్తం కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ, భట్టి విక్రమార్క అధ్యక్షతన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండటం వల్ల ఏ పథకం వచ్చినా అక్కడికే పోతోందనే మాట వినిపిస్తోంది.


MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మునుగోడుకు అన్యాయం..

నా మునుగోడు ప్రాంతంలో ఒక్క లిఫ్ట్ లేదు, కాల్వ లేదు, కనీసం చెరువులు కూడా లేవు. మన (కాంగ్రెస్) ప్రభుత్వం ఉండి కూడా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే, ఒక ఎమ్మెల్యేగా మౌనంగా ఉండటం నేరం. నేను ఎవరి బెదిరింపులకు భయపడను, ప్రలోభాలకు లొంగను. నా ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండటం కూడా అనవసరమని భావిస్తున్నాను. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి. నా నియోజకవర్గానికి నిధుల కోసం నేను మంత్రులు, సీఎం చుట్టూ తిరగాలా? మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతే పదవి వల్ల ప్రయోజనం ఏముందని’ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలివే.. 

మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రమే బిల్లులు వస్తున్నాయని, మిగిలిన నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం అంటే కేవలం మంత్రులు మాత్రమే కాదని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం పట్ల సమాన బాధ్యత ఉండాలని ఆయన గుర్తు చేశారు.

నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ప్రతిసారీ మంత్రులు లేదా ముఖ్యమంత్రి చుట్టూ తిరగాలా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

మునుగోడు ప్రజలకు సాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందితే, ఒక శాసన సభ్యునిగా తన పదవిలో కొనసాగడం వ్యర్థమని రాజగోపాల్ రెడ్డి భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget