అన్వేషించండి

CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Assembly | కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సీబీఐకి అప్పగించినా మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్‌ మండిపడ్డారు.

Telangana Assembly Sessions | హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సభలో కేవలం సూచనలు ఇచ్చి పారిపోవడం బీజేపీ సభ్యులకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణను ఇప్పటికే సిబిఐకి అప్పగించామని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

హరీష్ రావు బంధువులు భూ దోపిడీ చేశారు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి హరీష్ రావు బంధువులు భూ దోపిడీకి పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు హౌస్‌ కమిటీ వేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని గతంలో బీజేపీ నేతలు ఆరోపించారు.. సిబిఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పారు. అందుకే కాళేశ్వరంపై అవినీతి, కేసు ఫైల్‌ను సిబిఐకి ఇచ్చినా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడి విచారణ జరిపించే ధైర్యం బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మరోవైపు, సభలో బీఆర్‌ఎస్‌ సభ్యులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై కూడా సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ సంస్థ అక్రమాలపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యేలు గళమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు నగరంలోని గన్‌పార్క్‌ వద్ద నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీకి కాలినడకన వచ్చారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సాగించిన అక్రమాలను తాము ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకు? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం సభా సంఘమే కాకుండా, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget