అన్వేషించండి

CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

Illegal mining allegations: తెలంగాణ అసెంబ్లీలో అక్రమ మైనింగ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నేతలందరి సంస్థలపై సీఐడీ విచారణకు ఆదేశించారు.

Revanth orders probe into leaders illegal mining allegations: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక , ఖనిజ తవ్వకాలపై సీఐడీ   విచారణకు ఆదేశిస్తున్నట్లు  సీఎం రేవంత్ ప్రకటించారు. ముఖ్యంగా జూన్ 2, 2014  నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని మైనింగ్ లీజులు, అనుమతులు , అక్రమాలపై ఈ దర్యాప్తు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి పూర్తి స్థాయి నివేదికను సభ ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు.
 
బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు వంటి వారు రాజేంద్రనగర్ మండలం  మానస హిల్స్  ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన  రాఘవ కన్‌స్ట్రక్షన్స్  అక్రమ మైనింగ్ చేస్తోందని ఆరోపించారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆ కంపెనీతో మంత్రికి సంబంధం లేదని, కేవలం బ్లాక్‌మెయిల్ రాజకీయాల కోసమే బీఆర్ఎస్ ఈ ఆరోపణలు చేస్తోందని కొట్టిపారేశారు. అయితే, విచారణ మాత్రం నిష్పక్షపాతంగా జరుగుతుందని, అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
 
గత ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడిందని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం 32 శాతం పెరిగిందని ఆయన గణాంకాలను వివరించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని, అదే నిజమైతే ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఎలా పెరుగుతుందని ఆయన ప్రశ్నించారు.  ఇసుక రవాణాలో పారదర్శకత కోసం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని, ఆన్‌లైన్ బుకింగ్ సమయాన్ని కూడా సవరించామని తెలిపారు. ప్రభుత్వ భూములు , ప్రకృతి సంపదను కొల్లగొట్టే వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, సీఐడీ నివేదిక ఆధారంగా తదుపరి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన సభకు వివరించారు. 
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రల పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ , ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ మైనింగ్‌లో భారీ అక్రమాలు జరిగాయని, ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారని ఆరోపించారు. గత పదేళ్లలో వీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలను ఎగ్గొట్టడమే కాకుండా, పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని రేవంత్ మండిపడ్డారు. గతంలోనే గంగుల కమలాకర్ ,వద్దిరాజు రవిచంద్రలకు చెందిన గ్రానైట్ కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు  దాడులు చేసి, సుమారు రూ. 750 కోట్ల వరకు జరిమానాలు విధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ జరిమానాలను వసూలు చేయకుండా వారిని కాపాడిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఆ బకాయిలను వసూలు చేయడంతో పాటు, జరిగిన అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపి నివేదిక సిద్ధం చేస్తుందని ప్రకటించారు.
  
ఈ విచారణ కేవలం రాజకీయ కక్ష సాధింపు కాదని, రాష్ట్ర సంపదను కాపాడటమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. గంగుల, వద్దిరాజుల కంపెనీలతో పాటు గత ప్రభుత్వంలో మైనింగ్ లీజులు పొందిన ఇతర నేతల వివరాలను కూడా సేకరించాలని అధికారులను ఆదేశించారు. సీఐడీ దర్యాప్తులో ఈ నేతల పాత్ర రుజువైతే, మైనింగ్ లీజుల రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.  

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
Nirmal News: నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget