అన్వేషించండి

KCR in Munugode: మునుగోడుకు సువర్ణావకాశం, నా గుండెల్లో పెట్టుకుంటా - 15 రోజుల్లోనే అన్నీ: కేసీఆర్

కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కాబట్టి అరాచక పాలన చేస్తున్న బీజేపీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ప్రజలకు సువర్ణావకాశం వచ్చిందని, ఉప ఎన్నిక తీర్పుతో బీఆర్ఎస్‌కు పునాది రాయి ఇక్కడే పడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలకు, వామపక్ష పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. అది సమంజసం కాదని, కాబట్టి అరాచక పాలన చేస్తున్న బీజేపీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని ధరలు పెంచడంతో పాటు తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి ఓటు వేస్తే తాము కూడా ఏమీ చేయలేమని అన్నారు. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు నియోజకర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

" ఎనిమిదేళ్లలో తెలంగాణ పచ్చబడ్డది. కొద్దిగా తెల్లబడ్డం. మంచిగ చేసుకుంటున్నం. తెలంగాణలాగానే దేశమంతా పాలన అందించేందుకు పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం. చరిత్రలో సువర్ణావకాశం మునుగోడుకే దక్కింది. భారత దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మునుగోడుకే దక్కింది. తెలంగాణ ఉద్యమానికి ముందు సిద్దిపేటలో 60 ఓట్ల మెజారిటీ సద్దిగట్టి తెలంగాణ పోరాటానికి పంపించిన్రు. ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో కేసీఆర్‌కు ఎంత పెద్ద సద్దిగడతరో అంత పెద్ద విజయం భారత దేశంలో వస్తది. దేశమే బాగుపడతది. రేపు కేసీఆర్ ఎంత పెద్దగా పెరిగిన బీఆర్ఎస్ పునాదిరాయి మునుగోడే కాబోతుంది. కాబట్టి, మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటా "
-కేసీఆర్

గాడిదలకు గడ్డి వేస్తే.. ఆవులకు పాలు వస్తయా
‘మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపం అవుతుంది. ఈ వ్యవహారాన్ని ప్రతి విద్యావంతుడు, ప్రతి యువకుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు అందరూ ఆలోచించుకోండి. మీ ఊరికి వెళ్లిన తర్వాత అందరూ చర్చించుకోండి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగపోకండి. ప్రలోభాలకు లొంగితే మంచి జరగదు. మనం పళ్లు తినాలంటే ముళ్ల చెట్లు పెడితే పళ్లు రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి.. ఆవులకు పాలు పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదకి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలి’’


KCR in Munugode: మునుగోడుకు సువర్ణావకాశం, నా గుండెల్లో పెట్టుకుంటా - 15 రోజుల్లోనే అన్నీ: కేసీఆర్

వడ్లు కొనరు కానీ, ఎమ్మెల్యేలను కొనడానికి వస్తున్నరు - కేసీఆర్
తెలంగాణ వడ్లు కొనాలని అడిగితే చేతగాని కేంద్ర ప్రభుత్వం డబ్బు సంచులతో ఎమ్మెల్యేలను కొనేందుకు హైదరాబాద్ వచ్చిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ‘‘మా పంట కొనాలని వడ్లు కొనాలని అడిగితే స్పందించరు కానీ, రూ.వందల కోట్లు సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనాలని వస్తరా? ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలా? వద్దా? మీరంతా ఆలోచించాలి. వీటన్నింటికీ మీరు జవాబు చెప్పకపోతే వాళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తరు. మేం చేసేది ఏమీ ఉండదు. గ్యాస్ రేటు పెరిగింది.. పెట్రోల్ రేట్లు పెరిగాయి.. జీఎస్టీ ఎస్తున్నారు అని మనం కొట్లాడాలి. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? వారి చేతిలో కత్తి పెడితే.. వాడు మన మెడ కోసేస్తడు. కాబట్టి, కత్తి ఒకడి చేతిలో పెట్టి యుద్ధాన్ని మరొకరిని చేయమంటే సమంజసం కాదు. ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచిగుంటమని గమనించాలి.

మన భారత విద్యుచ్ఛక్తి సంస్థలు ఇన్నేళ్ల నుంచి రూ.లక్షల కోట్లతో ఒక వ్యవస్థలా ఏర్పడ్డాయి. అలాంటి సంస్థలను పేలాలు అమ్మినట్లుగా ప్రైవేటు సంస్థలకు ఇస్తరట. వాడు మళ్లీ మన దగ్గర్నుంచే డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తరు. అలాంటి వ్యవస్థలను ప్రైవేటు కార్పొరేటు గద్దలకు అప్పజెప్తమా? అందరూ ఆలోచించండి.

చర్లగూడెం ప్రాజెక్టును ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడితే.. ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు వేరుపడితే పెద్దలు ఏం చేస్తరు? గిది నీదిరా.. గిది నీదిరా అని పంచుతరు? నీళ్లలో మన వాటా ఇవ్వడానికి బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీకి ఎనిమిదేళ్లు చాలలేదా? ఎందుకివ్వవు మోదీ? నోరు పెగలదు.. నోరు తెరవవు. నేను మహామొండి మీకు తెలుసు. మునుగోడులోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి.. తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ అనేవి చాలా చిన్నవి. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget