అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nalgonda: బొమ్మలిద్దామని ఎత్తుకుని తీసుకెళ్లిన తల్లి తనకు తెలియకుండానే చిన్నారిని మృత్యు ఒడికి చేర్చింది, ఏం జరిగిందంటే

ఆడుకునేందుకు బొమ్మలిద్దామని తీసికెళ్లిన ఆతల్లి తనకు తెలియకుండానే చిన్నారి మరణానికి కారణమైంది.నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ముంపు గ్రామం లక్ష్మణాపురంలో జరిగిందీ ఘటన.

ఈ లోకంలోకి అడుగుపెట్టిన పది నెలలకే ఆ చిన్నారికి ఆయువు తీరిపోయింది. అమ్మ,నాన్న, అక్క, ఆటబొమ్మలు తప్ప ఇంకా మరో ప్రపంచం తెలియదు. కానీ ఆ ఆటబొమ్మలే తన మృత్యువుకి కారణం అవుతాయనుకోలేదు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ముంపు గ్రామం లక్ష్మణాపురానికి చెందిన బాణావత్‌ గణేశ్‌-దివ్య దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం తమ పది నెలల కుమారుడు భవిత్‌ను ఆడిస్తోన్న తల్లి బొమ్మలిచ్చేందుకు ఎత్తుకుని కిటికీ దగ్గరకు తీసుకెళ్లింది. అయితే ఇంటిగోడలకు ప్లాస్టింగ్ లేకపోవడంతో వాటి మధ్యలో పాము దూరిఉన్న విషయం ఎవ్వరూ గమనించలేదు. కిటీకీ వైపు తిరిగి ఆమె బొమ్మలు తీస్తోంది. ఇంతలోనే తల్లి ఎత్తుకుని ఉన్న చిన్నారి కాలుపై తాచుపాము కాటేసింది. బాబు ఉలికిపాటు గమనించి ఏమైందంటూ అటు తిరిగేసరికి మరోసారి కాటేసింది పాము.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

ఏం జరిగిందో అర్థమయ్యేలోగా పదినెలల చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఆ తల్లి కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వెంటనే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే భవిత్  చనిపోయాడు. ఆదివారం సాయంత్రం జరిగిందీ ఘటన. అప్పటికే చీకటి పడడంతో పాము బయటకు రాకుండా కాపలాకాసిన గ్రామస్తులు సోమవారం చౌటుప్పల్‌ నుంచి పాములు పట్టే వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని పట్టుకున్నారు. అప్పటి వరకూ కేరింతల కొట్టిన చిన్నారి కొద్ది క్షణాల్లో కన్ను మూశాడంటే ఆ ఘటన నుంచి తల్లి ఇప్పట్లో తేరుకోగలదా. ఆమె కన్నీళ్లను ఆపడం ఎవ్వరివల్లా కావడం లేదు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో వానలే.. వానలు.. మరో రెండు రోజులు కూడా.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

సాధారణంగా వానాకాలంలో పాములు సంచారం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా గడ్డి, పొదలు పేరుకుపోవడంతో అవి  స్వేచ్ఛగా తిరుగుతాయి. ఏటా వానాకాలంలోనే పాముకాటుకి గురయ్యే వారి సంఖ్య ఎక్కువే. వానలు పడినప్పుడు పుట్టలు, కలుగులు నీటితో నిండడంతో పాములు నీళ్లులేని పొడి ప్రదేశం కోసం వెతుకుతాయి. చిన్న కలుగు కనిపించినా ఆవాసంగా చేసుకోవాలని అనుకుంటాయి. అలాంటి సమయంలో మనుషులు ఎదురయ్యే సరికి కాటేస్తాయి. ఇలా పాము కాటుతో మరణిస్తున్నవారి సంఖ్య ఇండియాలోనే అత్యధికంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు గతంలోనే వెల్లడించాయి.  ప్రధానంగా గ్రామీణప్రాంతాల్లో విషపురుగులు, పాములు అధికంగా సంచరిస్తుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాటికి బలైపోవాల్సిందే.

Also Read:ఈ రాశులవారు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం…వారు మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

Also read: ఈ వారం మూడు రాశులవారికి చాలా ప్రత్యేకం.. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూడండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులిఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Embed widget