అన్వేషించండి

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు - వడివడిగా కృష్ణమ్మ పరుగులు

Telangana News: నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకు ముందు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు.

Nagarjuna Sagar Dam Crust Gates Lifted: ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్‌కు భారీగా వరద పోటెత్తిన క్రమంలో అధికారులు సోమవారం 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకుముందు ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు మూడుసార్లు సైరెన్ మోగించారు. అనంతరం ఒక్కో గేటును ఎత్తి ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి దాదాపు 5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా బట్టి గేట్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి 4.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కృష్ణా పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 582.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 290.51 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 3,23,748 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 83,331 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Medak Collector: రైతులుగా మారిన కలెక్టర్ దంపతులు - ఇద్దరు కుమార్తెలతో కలిసి పొలం బాట పట్టి నార్లు వేసి..

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget