MLC Kavita round table meeting : మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ ఉద్యమం - రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత !
ఇప్పటికే ఎన్నోసార్లు మాట ఇచ్చి తప్పిన బీజేపీ ప్రభుత్వం.. మరోసారి దేశంలోని మహిళలను మోసం చేయవద్దని కవిత విజ్ఞప్తి చేశారు.
MLC Kavita round table meeting : మహిళా రిజర్వేషన్ పై పోరాటం చేయడం తన పూర్వజన్మ సుకృతమన్నరు ఎమ్మెల్సీ కవిత. పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగానే.. ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నరు. ఒకవైపు దశలవారీగా పోరాటం చేస్తూనే.. మరోవైపు పార్లమెంట్ లోనూ కేంద్రాన్ని నిలదీస్తామన్నరు. ఇప్పటికే ఎన్నోసార్లు మాట ఇచ్చి తప్పిన బీజేపీ ప్రభుత్వం.. మరోసారి దేశంలోని మహిళలను మోసం చేయవద్దని సూచించారు. జంతర్ మంతర్ లో జరిగిన దీక్షకు చాలా పార్టీలు మద్దతు తెలిపాయన్నారు కవిత. పార్లమెంట్ ఎంపీల కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్ లోపల కూడా ఒత్తిడి కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇవాళ్టి రౌండ్ టేబుల్లో సమావేశానికి 13 పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఎంపీలందరికి భారత జాగృతి నుంచి పరోశోధన పత్రలు ఇచ్చారు. అనేక రకాల కార్యక్రమాలను అందులో రూపొందించారు. ఈ పోరాటంలో అన్నిరాజకీయా పార్టీలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు కవిత.
ఒక మహిళగా మహిళలా రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు కవిత. ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అనే నినాదంతో ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేశారు. అనేక ప్రశ్నలు, వాయిదా తీర్మానాలు, ప్రశ్నలు, ప్రైవేటు మెంబెర్ బిల్లు, స్పెషల్ మెన్షన్స్ ఇలా.. అనేక రకాలుగా పోరాడవచ్చని ఆమె తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారామె. రెండుసార్లు బీజేపీ మహిళలకు మాట ఇచ్చిందని గుర్తు చేశారు. దేశ మహిళలను మోసం చేయవద్దని బీజేపీని విజ్ఞప్తి చేశారు. డ్రాఫ్ట్ బిల్లు మొదలుపెట్టండి... అన్ని పార్టీలు కలిసివస్తాయని ఆమె సూచించారు. అభ్యంతరాలు చెబుతుంటే తక్షణమే పరిష్కారాలు వెతకవచ్చని కవిత అభిప్రాయ పడ్డారు. ఈ చరిత్రాత్మక అవకాశాన్ని వదులుకోవద్దని ఆమె పిలుపునిచ్చారు. మహిళలకు అన్యాయం చేయవద్దని ఆమె కోరారు.
భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళా బిల్లు పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి అనేక పార్టీలు, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, కొత్తప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్ హాజరయ్యారు. సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ, సీపీఐ ఎంపీలు బినోయ్ విశ్వం, ఆర్ఎల్డీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది, డీఎంకే ఎంపీ తమిళీ తంగపాండ్యణ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, జేఎంఎం నుంచి మహువా మాన్జీ, బీమ్ ఆర్మీ నుంచి హర్జిత్ సింగ్ భట్టి, బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ తదితరులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు లే మెరీడియన్ హోటల్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈనెల 10న జంతర్ మంతర్ దగ్గర 12 పార్టీలతో కలిసి ఆమె నిరాహార దీక్ష చేశారు. మహిళ బిల్లును తక్షణమే కేంద్రం తీసుకురావాలని అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా డిమాండ్ చేశారు. అయితే, ఆ బిల్లుపై పార్లమెంటులో చర్చకు రాకపోవడంతో దానికి కొనసాగింపుగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.