అన్వేషించండి

Adilabad MP Seat: ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం ఢిల్లీలో బీజేపీ నేతల కుస్తీ

Loksabha Elections 2024: నలుగురు బీజేపీ నేతలు ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో మకాం వేసి, సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

BJP Candidates List: ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో కుస్తీ పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పక్కనపెట్టి అధిష్టానం కొత్తవారిని నియమించాలని భావిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ (Adilabad MP Seat) కోసం 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ సోయం బాపురావ్ ను పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. బాపురావుకు టికెట్ ఇవ్వొద్దంటూ అంతర్గతంగా చర్చలు చేస్తూ అటు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయితే బీజీపీ ఎమ్మెల్యేలకు సోయంకూ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని నేతలు చెబుతున్నారు. 

రాష్ట్ర బీజేపీలో మళ్లీ లుకలుకలు 
ఇటీవల బాసర నుంచి చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో బాగానే కలిసి నడిచిన నేతలు ఆదిలాబాద్ లో ప్రధాని సభ వరకు బాగానే ఉన్నారు. ఆ తరువాత మళ్ళీ బీజేపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. బీజేపీ నాయత్వం సోయం బాపురావుకు టికెట్ ఇవ్వద్దని, తాము అనుకున్న నేతలకే ఎంపీ టికెట్ ఇవ్వాలని హైదరాబాద్ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు పైరవీలు చేస్తున్నారు. రేసులో ముఖ్యంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, సర్దార్ అభినవ్, శ్రీలేఖ, డా. సుమలత ఇతరులు ఉన్నారు. వీరితో వ్యవహారం సరిపోలేదన్నట్లుగా చివరికి బీజీపీ నేతలు, కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడం నగేష్ ను ఢిల్లీ కి తీసుకెళ్ళి రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేర్పించారు. సోయం బాపురావుకు చెక్ పెట్టెందుకు ఆదివాసీ గోండు తెగకు చెందిన గోడం నగేష్ ను రంగంలోకి దింపారు. ఆయనకే టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారు. దీంతో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న మిగతా నేతలు సైతం ఢిల్లీలో నాలుగు రోజులుగా కుస్తీ పడుతున్నారు. 


Adilabad MP Seat: ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం ఢిల్లీలో బీజేపీ నేతల కుస్తీ

( Image Source : PTI )

సోయంకు, నగేష్ కు టికెట్ ఇవ్వొద్దని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ లలో ఎవరికైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్. సంతోష్ ను కలిసి మాట్లాడారు. ముఖ్య నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పగా ఆ నేతలు టికెట్ పై గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. వారంతా ఢిల్లీలోనే ఉంటూ టికెట్ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ నేతలతోనూ టచ్ లో ఉంటూ బాపురావ్, నగేష్ కు టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం రాష్ట్రంలో ఉన్న రెండు గిరిజన స్థానా (ST Loksabha Seats)ల్లో ఒకటి మహబూబాబాద్,  అయితే రెండవది ఆదిలాబాద్ లో ఆ తెగల ఓటు శాతం ఆధారంగా టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల ప్రభావం ఎక్కువగా ఉందని భావించి మాజీ ఎంపీ నగేష్ కే టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

అటు మహబూబాబాద్ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ లంబాడీ గిరిజన సంఖ్య అధికంగా ఉంది. ఇలా అధిష్టానం భావించి ఆ ప్రాంతాల్లో ఉన్న నేతలకు అక్కడ మంచి పట్టు ఉందని భావించి వారికి టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదిలాబాద్ లో మాత్రం సోయం బాపురావ్, గోడం నగేష్ ఇద్దరు ఆదివాసీ నేతలకు కూడా టికెట్ ఇవ్వొద్దని ఆ బీజేపి నేతలు పట్టుబట్టారు. నేడో రేపో బీజేపి రెండో జాబితా విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే బీజేపీ అధిష్టానం అదిలాబాద్ ఎంపీ టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Embed widget