News
News
వీడియోలు ఆటలు
X

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్

ప్రజారవాణా ఛార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితి

మోదీ మిత్రుల ఖజానాను నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు

FOLLOW US: 
Share:

పెట్రో ధరల దోపిడీని ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫలితంగా ప్రజారవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్రం కల్పించిందని అన్నారు. పెట్రో ధరలను పెంచి ప్రజలను వంచించిన కేంద్రం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మోదీ మిత్రుల ఖజానాను నింపేందుకు పెట్రోల్ ధరల పెంచారని ఆరోపించారు.

కేటీఆర్ లేఖలో ఇంకే రాశారంటే..

పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్,  డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటున్నది. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ  కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయింది. 2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనం. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడిచమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నది.

ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితి

పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద,సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది.  2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45శాతానికి పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు,ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత 45 సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోంది.

పెట్రోల్ పేరుతో దోపిడీని కొనసాగిస్తున్న కఠినాత్ముడు ప్రధాని

ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలప్రస్తావన లేదంటే, ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. కానీ ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తక్కువ ధరకు ముడిచమురు అందుబాటులో ఉన్నా, ప్రజల జేబుల నుంచి పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు.  కేంద్రప్రభుత్వం చెబుతున్నరూ. 35 వేల కోట్ల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం. దేశీయ వినియోగం పేరు చెప్పి భారీగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును, శుద్ధి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచుతున్నది. తక్కువ ధరకు ముడి చమురును కొని తిరిగి విదేశాలకే పెట్రోలు అమ్ముతున్న కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని, దానిపై ప్రభుత్వానికి వచ్చే విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలి. కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినప్పటికీ దేశప్రజల పట్ల మాత్రం పెట్రోల్ పేరుతో దోపిడీని కొనసాగిస్తున్న కఠినాత్ముడు ప్రధానమంత్రి మోడీ అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను.

కేంద్ర మంత్రుల వైఖరి గురవింద సామెతలా ఉంది

అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 2013లో ఉన్న స్థాయికి పడిపోయిన నేపథ్యంలో భారీగా పెంచిన, పెట్రోల్ రేటును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా మోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ ప్రజల నుంచి పెట్రోల్ ధరల రూపంలో చేస్తున్న దోపిడీని ఆపాలని డిమాండ్ చేస్తున్నాను. మరోవైపు తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి  ఒక్క రూపాయి వ్యాట్ పెంచకున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్సుల పేరుతో 30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టింది. కానీ ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 70 డాలర్ల లోపు చేరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోల్ రేటును తగ్గించేందుకు కేంద్రం విధించిన సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. పెట్రోల్ ధరలు తగ్గాలంటే దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర మంత్రులు చెప్పడం గురవింద సామెతను తలపిస్తుంది. జీఎస్టీ పరిధిలో ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 400నుంచి 1200 కు పెంచిన అసమర్ధ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది. ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు కల్లబొల్లి కబుర్లు చెప్పడం అర్ధరహితం. జీఎస్టీ పరిధిలో ఉన్న సిలిండర్ ధరలను కేంద్రం ఎందుకు తగ్గించలేకపోయిందో ముందు సమాధానం చెప్పాలి.

పెట్రోభారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవాలి

ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. అయితే దేశ ప్రజలు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను అనుభవిస్తున్నారు. కేంద్రప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రోభారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలి. లేకుంటే ప్రజల చేతిలో  కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.

Published at : 30 Mar 2023 07:48 PM (IST) Tags: BJP Modi KTR petrol Price

సంబంధిత కథనాలు

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

Adilabad: దీనావస్థలో ఆ కుటుంబం, ఇంటి పెద్దదిక్కుగా మారిన మూగ బాలిక ! సాయం కోసం ఎదురుచూపులు

Adilabad: దీనావస్థలో ఆ కుటుంబం, ఇంటి పెద్దదిక్కుగా మారిన మూగ బాలిక ! సాయం కోసం ఎదురుచూపులు

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!