అన్వేషించండి

KTR sends legal notices to Bandi Sanjay: 48 గంటల టైమిస్తున్నా సారీ చెప్పు - బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

KTR legal notice: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

KTR issues legal notice to Bandi Sanjay:   ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్..కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నా  ఇంటెలిజెన్స్ పనితీరు గురించి అవగాహన లేదని బండి సంజయ్ పై కేటీఆర్ మండిపడ్డారు.  కనీస  జ్ఞానం కూడా లేదన్నారు.  బండి సంజయ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను  నీచమైనవని..  వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. KTR బండి సంజయ్‌కు 48 గంటల్లోగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.  

బీఆర్ఎస్ హయాంలో  ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేసులు నమోదు చేసి విచారణ జరుగుతున్న  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ ఎదుట కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ,  కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు.  ఈ కేసులో సాక్షిగా   SIT ముందు హాజరయ్యారు. ఆయన తన ఫోన్‌తో పాటు తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లు కూడా BRS ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేశారని ఆరోపించారు. బండి సంజయ్ ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి BRS నాయకులను రక్షిస్తున్నారని, SIT విచారణపై తనకు నమ్మకం లేదని పేర్కొన్నారు.   బండి సంజయ్ తన ఫోన్‌ను మావోయిస్ట్ కార్యకలాపాల పేరుతో ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, BRS నాయకులు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, వారి భర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా పేర్కొన్నారు.   ఆయన మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR), KTR,   SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ వెనుక ఉన్నారని ఆరోపించారు. 

ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారు.  రాజకీయంగా ప్రాధాన్యత కోసం చీప్ డ్రామా చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. మంత్రిగా బాధ్యతాయుతంగా పని చేయడం..  ఢిల్లీ బాస్‌ల చెప్పులు మోసేంత సులభం కాదని ఎద్దేవా చేశారు.  జూన్‌లో, KTR తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై లీగల్ నోటీసు జారీ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలను "నాటకాల కోసం" ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఈ నోటీసులపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget