Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
మహబూబ్ నగర్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే మోదీ రాావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ కల్వకుంట్ల జాగీర్ కాదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
![Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ ! KTR demanded that Modi should come only after apologizing to the people of Mahbubnagar. Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/c26e7ab15388808160ead7f1699808541695730700271228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kishan Reddy On Ktr : తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల జాగీర్ కాదని… తండ్రి చాటు బిడ్డగా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. అక్టోబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశమవుతుందన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో అక్టోబర్ 3న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు.
అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గు చేటు : కిషన్ రెడ్డి
వులకు, కళాకారులకు. విద్యావంతులకు.. మేధావులకే ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ.. కేసీఆర్ కుటుంబానికి కొమ్ముకాస్తున్న వాళ్లు.. వారికి సేవ చేసే వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయం సరైనదేనన్నారు. హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం తమకు లేదన్నారు. రాష్ట్రంలో అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటనీ విమర్శించారు. 17సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని, ఖమ్మంలో కూడా పార్టీ బలపడిందన్నారు. ప్రధాని మోడీ పర్యటన తర్వాత అమిత్ షా, నడ్డా పర్యటనలు ఉంటాయన్నారు.
ప్రధాని క్షమాపణ చెప్పి పాలమూరు రావాలన్న కేటీఆర్
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ శంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటైన పాలమూరు జిల్లాకు మోదీ ఏం చేయలేదని స్పష్టం చేశారు. 2014 జూన్ 2న తెలంగాణ వస్తే జులై 14న ఓ లేఖ తీసుకుని మీ దరగ్గరకు కేసీఆర్ వచ్చారు. నీళ్లలో జరిగిన అన్యాయం గురించి మోదీకి వివరించారు. గోదావరి, కృష్ణా జలాలల్లో మా వాటా తేల్చాలని, అప్పుడే న్యాయబద్దమైన వాటా దక్కుతుందని కోరారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు సహకరించండి, జాతీయ హోదా ఇవ్వాలని కోరాం. కాళేశ్వరం లేదా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాం. కరువులు, కన్నీళ్లు, వలసలతో గోసపడ్డ పాలమూరు ఇప్పుడే పచ్చబడుతుంటే.. ప్రధాన మంత్రి, ఆయన పార్టీ పగబట్టింది. కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోగా, మరోవైపు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.
ఒక్క సంతకం పెట్టలేదన్న కేటీఆర్
అప్పర్ భద్రకు, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును పక్కనపెట్టారు. పాలమూరు గడ్డ మీద కాలుపెట్టే ముందు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. కృష్ణా జలాల్లో వాటా తేల్చుతామని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానాన్ని అవలంభిస్తుంది బీజేపీ పార్టీ. అసలు జాతీయ పార్టీనా..? కాదా? స్పష్టం చేయాలి. తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, ద్రోహం చేసిన దగ్బులాజీ పార్టీ బీజేపీ అని కేటీఆర్ పేర్కొన్నారు.పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని గతంలో బీజేపీ నాయకులు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. పర్యావరణ, ఇతర సాంకేతిక అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారు. దీనికి మీరు బాధ్యులు కాదా..? కృష్ణా జలాల్లో వాటా తేల్చమని ట్రైబ్యునల్‌కు రెఫర్ చేయడానికి ఎందుకు మనసు రావడం లేదు. ఒక్క మాట, ఒక్క సంతకం పెట్టే తీరిక లేదా..? నికృష్ట రాజకీయం ఎందుకు అని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)