అన్వేషించండి

Maoist surrender: మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ - లొంగుబాటలో ఆజాద్, రమేష్ - కంకణాల రాజిరెడ్డి కూడా ?

Telangana: తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టులు లొంగిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారు కొన్ని ప్రతిపాదనలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి.

Key Maoists from Telangana to surrender: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ తగిలే సూచనలు కనిపిసతున్నాయి.  నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) – సిపిఐ(మా) పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్  అలియాస్ గోపన్న , డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్‌తో పాటు వారి క్యాడర్ 20 మంది లొంగిపోతున్నట్లు విశ్వసనీయమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సరెండర్ వచ్చే వారం రోజుల్లో  జరిగే అవకాశాలు ఉన్నాయి. 

తెలంగాణ పోలీసులు 'ఆపరేషన్ చెయుత' పేరుతో లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. 2025లో ఇప్పటికే 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారని డీజీపీ బి. శివధర్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.  కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న  భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లా మొద్దుల గూడెం గ్రామానికి చెందిన వారు.  1995 నుంచి ఆజ్ఞాతంలో ఉన్నారు.   తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు (బీకేజీ-ఏఎస్‌ఆర్) డివిజన్ కమిటీ మాజీ కార్యదర్శి. రాష్ట్ర కమిటీ సెక్రటరీ హరిభుషణ్ మరణం తర్వాత లీడర్‌షిప్ పోటీలోఉన్నారు. కానీ బాదే చొక్క రావు అలియాస్ దామోదర్ సెక్రటరీగా ఎదిగారు.  అతని తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది.  

 అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎఫ్‌సిఐ ప్రాంతం స్వస్థలం. 1999 నుంచి ఆజ్ఞాతతంలోఉన్నారు.  తెలంగాణ రాష్ట్ర కమిటీ టెక్నికల్ టీమ్ హెడ్, జమ్మూ కాశ్మీర్-వెస్ట్ పాకిస్తాన్ (జెఎన్‌డబ్ల్యూపీ) రీస్ట్రక్చరింగ్ బ్లాక్ మాజీ డివిజన్ కమిటీ సభ్యుడు.  కరీంనగర్  కమిటీ మెంబర్‌గా ప్రారంభించి, డివిజన్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు.ఇతనిపై ఐదు లక్షల రివార్డు ఉంది. ఈ ఇద్దరూ మధ్యవర్తుల ద్వారా తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. వారితో పాటు డివిజన్, ఏరియా కమిటీల సభ్యులు 20 మంది సరెండర్  అవుతారని అంటున్నారు.   మరో సీనియర్ రాష్ట్ర కమిటీ నేత కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.  పార్టీలో మిగిలిన 64 మంది మావోయిస్టులు కూడా మెయిన్‌స్ట్రీమ్‌లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

కంకణాల రాజిరెడ్డి కూడా లొంగుబాటు దిశగా చర్చలు

ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతానికి చెందిన మావోయిస్టు కీలక నేత కంకణాల రాజిరెడ్డి  సైతం  ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొద్ది నెలలుగా పెద్దపల్లి పోలీసులు ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదించి, సరెండర్‌కు ప్రోత్సహిస్తున్నారు. రాజిరెడ్డి పార్టీలో కేంద్ర కమిటీ మెంబర్‌గా గుర్తింపు పొందాడు, రూ. 1 కోటి ఆయన తలకు వెల కట్టారు.  సరెండ్ అయితే ప్రజాజీవితంలోకి వస్తానని తనకు పదవి ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లుగా చెబుతున్నారు.   తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతోంది. 2025లో ఇప్పటికే 427 మంది లొంగిపోయారు, వీరిలో  సీనియర్ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలోకి రావాలని    పిలుపు ఇచ్చారు.  పోలీసులు ఈ సరెండర్‌లకు సంబంధించి రిహాబిలిటేషన్ ప్యాకేజీలు  అందించనున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
Nirmal Udumpur Tribals Non Cooperation Movement : నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget