KCR Master Politics : టీఆర్ఎస్ ఢిల్లీ రాజకీయాలతో గల్లీ బీజేపీలో గందరగోళం ! కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అయిందా !?
కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను కలవడం, ముఖాముఖి సమావేశాలు నిర్వహించడం రకరకాల చర్చలకు కారణం అవుతోంది. టీ బీజేపీ నేతలను గందరగోళ పరుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం సాధ్యం కాదు. ఆయన నేరుగా ప్రకటనలతో చేసే రాజకీయం కన్నా చేతలతో చేసే రాజకీయం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ప్రస్తుత కేసీఆర్ వారానికిపైగా ఢిల్లీలో ఉండి చేసిన రాజకీయంతో తెలంగాణ రాజకీయం అంతా గందరగోళంగా మారింది. ఎంతలా అంటే 2020 డిసెంబర్ తరహాలో పరిస్థితి మారిపోయింది.
బీజేపీపై యుద్ధమేనని ప్రకటించి గ్రేటర్ ఎన్నికల తర్వాత సడన్ టర్న్..!
2020 నవంబర్‌లో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఓ రేంజ్‌తో అంచనాల్లో ఉన్నారు. అప్పటికి దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది. బీజేపీ దూకుడు మీద ఉంది. వెంటనే తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలను కూడా ఖరారు చేశారు. అలాంటి సమయంలో బీజేపీతో ఇక రాజీనే లేదు మిగిలింది యుద్ధమేనని ప్రకటించారు. దేశానికి ఓ కొత్త రాజకీయ దిశానిర్దేశం కావాలని అది తానే ఇస్తానని ప్రకటించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తున్నాయని దేశానికి కొత్త దశ, దిశ చూపాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్ అప్పట్లోనే ప్రకటించారు కొత్త రాజకీయాలకు తానే ఆవిష్కర్తనవుతానంటూ క్లారిటీ ఇచ్చారు. దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. డిసెంబర్ రెండో వారంలో ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేసఆర్ ఆవేశం చూసి అందరూ ఈ సారి ఫెడరల్ ఫ్రంట్ ఖాయం అనుకున్నారు. కానీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి వచ్చారు. అప్పటి వరకూ బీజేపీపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ నేతలు ఒక్క సారిగా సైలెంటయ్యారు. బీజేపీపై ఎవరూ ఘాటు విమర్శలు చేయవద్దని సూచించారు. కేసీఆర్ చేయడంతో ఎక్కువగా నష్టపోయింది టీఆర్ఎస్ కాదు బీజేపీనే.
Also Read : పంజరం నుంచి సీబీఐకి విముక్తి ఎప్పుడు ?
దుబ్బాక గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ స్పీడ్‌కి బ్రేకులేసిన కేసీఆర్ !
దుబ్బాకలో విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ ఇక తామే ప్రత్యామ్నాయం అన్నంత దూకుడు మీద ఉంది. వరుసగా పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఇక టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరగడం ఖాయం అని అనుకునేంతలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో సీన్ మార్చేశారు. టీఆర్ఎస్ ,బీజేపీ ఒక్కటేనన్న సందేశాన్ని అంతర్లీనంగా పంపేశారు. ఫలితంగా టీఆర్ఎస్ నేతల వలస బీజేపీలోకి ఆగిపోయింది. ఒక వేళ వెళ్లి బీజేపీలో చేరితే.. తర్వాత బీజేపీ టీఆర్ఎస్‌తో జట్టు కడితే తమ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కేసీఆర్ తన పార్టీ నేతలకు కల్పించారు. దీంతో అప్పటికి వలసలు ఆగిపోయాయి. ఇటీవల బీజేపీలో చేరే ముందు ఈటలకు కూడా ఇదే డౌట్ వచ్చింది. కానీ బీజేపీ అగ్రనేతలు కేసీఆర్‌తో రాజీ లేదు రణమే అని చెప్పి ఒప్పించారు. కేసీఆర్ మాత్రం బీజేపీతో రణం లేదు.. రాజీ లేదు.. పార్టీని కాపాడుకోవాలంటే తప్పదు అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అప్పటికి బీజేపీ ముప్పు తొలగిపోయింది. విజయవంతంగా బీజేపీని టీఆర్ఎస్ నీడలో ఉండేలా చేసుకోగలిగారు. దాని కోసం కేసీఆర్ చేసిందల్లా బీజేపీపై విమర్శలు ఆపేయడం.. హుటాహుటిన వెళ్లి మోడీతో సమావేశం కావడం మాత్రమే.
Also Read : రాజకీయ నేతలపై ఇక కేసులు పెట్టలేరా..?
ఢిల్లీ పర్యటనలో ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేశారా..?
ఇప్పుడు కూడా కేసీఆర్ అదే వ్యూహాన్ని అమలు చేశారన్న బలమైన అభిప్రాయం రాజకీయవర్గాల్లో కలుగుతోంది. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది రాజకీయ పర్యటన కోసం. తెలంగాణ భవన్ శంకుస్థాపన కోసం వెళ్లారు. హరీష్ రావును మినహా అందర్నీ తీసుకెళ్లారు. హరీష్ మాత్రం తెలంగాణలోనే ఉన్నారు, కేటీఆర్ సహా అందరూ ఢిల్లీలో ఉన్నారు. ఉన్నతాధికారులు ఎవరూ వెళ్లలేదు. కానీ కేసీఆర్ మాత్రం ప్రధాని మోడీతో.. అమిత్ షాతో ఏకాంత సమావేశాలు నిర్వహించారు. వారికి ఇచ్చామంటూ కొన్ని కోరిక లెటర్లను విడుదల చేశారు. అవన్నీ కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అడిగే కోరికలే... చేసే విజ్ఞప్తులే. అధికారులు లేకుండా కేసీఆర్ రాజకీయాలు తప్ప రాష్ట్రం గురించి మాట్లాడే అవకాశం ఉండదనేది రాజకీయాలు ఎక్కువగా తెలిసిన వారి మాట. అక్కడ ఢిల్లీలో కేసీఆర్ వరుస సమావేశాలతో తెలంగాణలో రాజకీయం చల్లబడటం ప్రారంభమయింది.
Also Read : వైసీపీ కీలక నేతను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఒరిస్సా పోలీసులు
బీజేపీతో టీఆర్ఎస్‌కు దగ్గరి సంబంధాలున్నాయన్న సందేశాన్ని వ్యూహాత్మకంగా పంపుతున్నారా..?
ఈటల రాజేందర్ పార్టీలో చేరిక తర్వాత బీజేపీ ఊపు మీద ఉంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సమరం పూరించారు. మరో వైపు బీజేపీ అగ్రనేతలు తరచూ వచ్చి బండి సంజయ్ యాత్రకు సంఘిభావం చెబుతున్నారు. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే అవన్నీ కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జరిపిన భేటీలతో కొట్టుకుపోయాయి. సీరియస్ నెస్ తగ్గిపోయింది. బీజేపీలోనూ ఇప్పుడేం చేద్దామన్న గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఓ రకంగా ఢిల్లీలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ తర్వాత మరోసారి ఆయన తెలంగాణ బీజేపీ నేతల్ని అయోమయంలో పడేశారు. బీజేపీతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయన్న రీతిలో తెలంగాలో ప్రొజెక్షన్ ప్రారంభించారు. కొన్ని మీడియా సంస్థలు.. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై అదే పనిగా విశ్లేషణలు రాస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు సహకారం అందించుకునేలా పరస్పరం మాట్లాడుకున్నారన్న అభిప్రాయానికి వచ్చేలా చేస్తున్నారు. మోడీతో పాటు షాతోనూ కేసీఆర్ వ్యక్తిగత సమావేశాలకే ప్రాధాన్యమిచ్చారని చెబుతున్నారు. అంటే రాజకీయమే మాట్లాడుకున్నారని కాంగ్రెస్‌ను నిలువరించడం అన్న అంశంపైనే చర్చలు జరిగాయన్న ప్రచారం ఊపందకుంది. ఇప్పుడు ఇది బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. కానీ ఎలా తిప్పికొట్టాలో తెలియని పరిస్థితి.
Also Read : బిగ్‌బాస్ హౌస్‌లో సిగరెట్ అలవాటున్న మహిళా సెలబ్రిటీలు వీళ్లే...
విపక్షాల్లో అనైక్యత కోసం ఫెడరల్ ఫ్రంట్‌ను మళ్లీ తెరపైకి తెస్తారా..?
పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ట్రై చేశారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో.. జాతీయ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించారు. కుమారస్వామి, శరద్ పవర్, మమత బెనర్జీ, కేజ్రీవాల్, పినరాయ్ విజయన్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ లాంటి నేతలతో భేటీ అయ్యారు. అప్పుడు ఆయన బీజేపీ కోసం విపక్షాల్లో అనైక్యత సృష్టించేందుకు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. ఇప్పుడు కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉందని కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే ప్రచారం ప్రారంభమయింది.అదే జరిగితే మళ్లీ బీజేపీ కోసమే ఆ ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు సహజంగానే వస్తాయి.
Also Read : విగ్గుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్న నూటొక్క జిల్లాల మాయగాడు