అన్వేషించండి

Kavitha : కల్వకుంట్ల కాదు కాళేశ్వరం చంద్రశేఖర్ రావు - అందరూ అలాగే పిలుస్తున్నారన్న కవిత !

కేసీఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలని కవిత వ్యాఖ్యానించారు.

Kavitha :   కేసీఆర్​ అంటే అందరూ కల్వకుంట్ల చంద్రశేఖర్​అనేవారని ఇప్పుడు కాళేశ్వరం చంద్రశేఖర్​ అంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.  ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​గా కాళేశ్వరం ఘనతకెక్కిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసినా ప్రాజెక్టుకి నిధులు, జాతీయ హోదా ఇవ్వక పోవడం సిగ్గు చేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్​ పాలనలో కాలువలు తవ్వి రూ.వేల కోట్లు దోచుకునే వారని అలాంటి వ్యక్తులు కాళేశ్వరంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ నిజామాబాద్​లో సాగునీటి దినోత్సవం జరిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవిత హాజరయ్యారు. 

దేశాన్ని 50 ఏళ్ల పాటు, ఉమ్మడి రాష్ర్టాన్ని ఓ దశాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్​ పార్టీ రాష్ర్టానికి సాగు, తాగు నీటిని అందించలేకపోయిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పదేళ్లలో బీఆర్​ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతోనే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్​ తాను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరని, కాంగ్రెస్​ హయాంలో  జరిగిన అభివృద్ధి ఏంటో ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు.  ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్  అని  స్పష్ట చేశారు.  కేసీఆర్‌ అంటే కాలువలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు. స్వల్పకాలంలో రాష్ట్ర గతినే మార్చే ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రిని.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలన్నారు. 
 
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపకోవడం సంతోషంగా ఉందని కవిత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇక్కడి వ్యక్తి పనిచేశారు. కానీ అప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి.. ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. కాలువలు తవ్వి రూ.వేల కోట్లు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో జిల్లా నీటిపారుదల రంగానికి రూ.5 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. పారదర్శక పాలన ఉంది కాబట్టే 21 రోజులపాటు ప్రతీ శాఖలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంత బాధ పడేవారో ఒక బిడ్డగా నాకు తెలుసునని వెల్లడించారు.
 
కాళేశ్వరంతో ఎక్కువ లబ్దిపొందుతున్నది నిజామాబాద్  జిల్లాయేనని తెలిపారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడిదుంకుతున్నాయంటే దాని వెనుక కేసీఆర్ శ్రమ ఎంతో ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణం అంటే అది భగీరథ ప్రయత్నం అని తెలిపారు. జిల్లాలో కాళేశ్వరం ద్వారా లక్ష 80 వేల ఎకరాలకు సాగునీరు అందించుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక ఇంజినీర్‌ల సంఖ్యను పెంచుకొని.. ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాలను పటిష్ట పర్చుకున్నామని చెప్పారు. అందుకే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో 15 శాతం భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget