RS Praveen Kumar: ఏ క్షణానైనా తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయొచ్చు.. ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్‌లో జరిగిన బీఎస్పీ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. తొలిసారి ప్రవీణ్ కుమార్ బీజేపీపై విమర్శలు చేశారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ క్షణంలోనైనా అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఎస్పీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన.. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం రాత్రికి రాత్రి జీవోలు విడుదల చేస్తోందని, హుజూరాబాద్‌లో డ్రామాలు నడిపిస్తోందని ఆరోపించారు. కరీంనగర్‌లో జరిగిన బీఎస్పీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
తొలిసారి ప్రవీణ్ కుమార్ బీజేపీపై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతుల్లోనే ఈడీ ఉంటోందని, నిజంగా అవినీతి జరిగితే విచారణ జరిపించొచ్చు కదా? అని ప్రశ్నించారు. మంత్రి స్థానంలో ఉన్న మల్లా రెడ్డి వాడిన భాష సభ్యసమాజం చీదరించుకునేలా ఉందని అన్నారు. ఆయన విద్యాసంస్థల్లో చదువుకునే పిల్లలకు కూడా ఆ బూతులే నేర్పిస్తారా? అని ఎద్దేవా చేశారు. రాబోయేది బహుజన రాజ్యమని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలదే అధికారం ఉంటుందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇప్పటి వరకూ పాలకులు దోచుకున్న రూ.వేల కోట్లను గల్లా పట్టి తీసుకొస్తామని హెచ్చరించారు. వాటిని వైద్యం, విద్య, ఉపాధి కల్పనకు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండబోదని అన్నారు. ‘‘తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటిదాకా 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు వస్తాయా? జోనల్ నిబంధనలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మూడేళ్లు పడుతుందా?’’ అని ప్రవీణ్ కుమార్ అని ప్రశ్నించారు.
Also Read: Nirmal News: భార్య చేసిన ఆ తప్పు భర్తను చంపేసింది.. బంధువులున్నా అనాథల్లాగా మారిన పిల్లలు
Also Read: High Court News: భార్యతో అలా శృంగారం చేస్తే రేప్‌గా పరిగణించలేం.. ఛత్తీస్ గఢ్ హైకోర్టు తీర్పు
తన సభలకు అధికార పార్టీ కరెంట్ తీసేస్తోందని, తాము అధికారంలోకి వస్తే.. కేసీఆర్ ఫాంహౌస్‌కు కరెంట్ కట్ చేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక, ప్రగతి భవన్‌ను బహుజన భవన్‌గా మారుస్తామని అన్నారు. మనకి నీలి తెలంగాణ కావాలని అన్నారు. తాము కాన్షీరాం, అంబేడ్కర్ వారసులమని.. మడమ తిప్పడం, మాట తప్పడం తమకు తెలియదని అన్నారు.
Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి అంత మాట అనేశారే.. రేవంత్ రెడ్డిపై అసంతృప్తే కారణమా?
Also Read: Hyderabad Crime: 2 కిలోల నగల బ్యాగుతో బస్సెక్కిన వ్యక్తి.. హైదరాబాద్ వచ్చేసరికి భారీ షాక్