News
News
X

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగీ కేసుల కలకలం, పదుల సంఖ్యలో నమోదు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగీ కలకలం సృష్టిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జులై ఒక్క నెలలో 25 కేసులు రాగా, ఆగస్టులో 22 వరకు నమోదయ్యాయి.

FOLLOW US: 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలను డెంగీ వణికిస్తోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. జూన్ నుంచి పదుల సంఖ్యలో కేసు నమోదు అవుతుండడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా చర్యలకు సిద్ధం అవుతున్నారు. కరీంనగర్ పట్టణంలో అత్యధికంగా ఈ ఏడాదిలో 25 కేసులు నమోదు అయ్యాయి. మానకొండూరులో 22 గంగాధర తిమ్మాపూర్‌లో 13 కేసులు గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో 116 మందిలో డెంగీ లక్షణాలు కనిపించాయని, అయితే అనధికారికంగా వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు నెలలో కేవలం సగం గడిచే వరకే 22 కేసుల వరకు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య జులైలో 25గా ఉంది. జూన్ లో 18 మాత్రమే కేసులు వచ్చాయి. రెండేళ్ల కిందట గమనిస్తే కేవలం ఒకటి రెండు కేసులు మాత్రమే కనిపించేవి. కానీ ఈ సంవత్సరం ఈ స్థాయిలో కేసులు నమోదు అవుతూ ఉండడంతో ఇక తక్షణ చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధం అవుతున్నారు.

అసలు ఎందుకిలా పెరిగిపోతున్నాయి?

ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో ఈసారి విపరీతమైన వర్షాలు కురిశాయి. జిల్లా అంతటా పల్లెలు, పట్నాలు తేడా లేకుండా వరద నీరు వ్యాపించింది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత కూడా నీరు మాత్రమే నిలిచి ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో దోమల సంఖ్య విపరీతంగా పెరిగింది. పల్లెలు పట్టణాల్లో డ్రై డే నిర్వహిస్తూ చేస్తున్నప్పటికీ దోమలను పూర్తి స్థాయిలో నిర్మూలించడం కుదరడం లేదు. ఎప్పటికప్పుడు మురుగు నీరు తొలగించిన కూడా తిరిగి వర్షాలు కురుస్తుండటంతో దోమల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. మరోవైపు పట్టణాల్లో డ్రైనేజీలో నిర్వహణ అధ్వానంగా తయారవడంతో జ్వరాలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఇక ఆయిల్ బాల్స్ వదలడం గంబూజియా చేపలు పెంచడం లాంటి చర్యలు చేపట్టడంలో ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలకు చెందిన అధికారులు విఫలం అవుతున్నారు.

కేవలం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో 350 పడకల సౌకర్యం ఉండగా ప్రతి రోజు ఆరు వందలకు పైగా రోగులు వస్తున్నారు. ఈనెల 15వ తారీఖున ఈ సంఖ్య 647 కాగా 16వ తారీకు ఆరు వందల ఎనిమిది మంది జ్వరం నిర్ధారణ కోసం వచ్చారు. అయితే చాలా వరకు పేషెంట్లు జ్వరానికి కావాల్సిన మందులు తీసుకొని తిరిగి ఇంటి బాట పడుతున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రిలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ప్రతి ఆస్పత్రిలోనూ జ్వరంతో బాధ పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ జ్వరాల కంటే డెంగీతో బాధ పడేవారికి చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దీంతో సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

డెంగీ లక్షణాలు ఏంటి?

డెంగీ ఫీవర్ ఎడిస్ ఈజిప్టై అనే దోమ కాటు వల్ల వస్తుంది. నిజానికి దీనికి ఎలాంటి చికిత్స లేదు. మలేరియాకు సంబంధించి వాడే మందులనే దీనికి కూడా వాడుతారు. 101 నుంచి 105 డిగ్రీల ఫారన్‌హీట్ జ్వరం హఠాత్తుగా వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి, కళ్లు తీవ్రంగా నీరసం, తల తిరగడం, ముక్కు నుంచి రక్తస్రావం ఉంటుంది. దోమ కుడితే ఏర్పడే ఎర్రని చుక్కల వంటివి ఏర్పడతాయి. మండటం వంటి లక్షణాలు వస్తాయి. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, కుడి ఉదర భాగం పై వైపున నొప్పి వస్తుంది. 

ఉష్ణోగ్రత పెరిగినపుడు  వీలైనంత త్వరగా చికిత్స మొదలు పెట్టాలి. డెంగీతోపాటుగా రక్తస్రావం (డెంగీ హెమరేజిక్ ఫీవర్) లేదా రక్తపోటు అతి తక్కువకు పడిపోవడం, డెంగీ షాక్ సిండ్రోమ్‌లు కనిపిస్తే ప్రాణాంతకమే. ఇలాంటి వారు 5 శాతానికి అటు ఇటుగా ఉంటారు. 95 శాతం మందికి ప్రాణాంతకం కాదు. చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వీలైనంత వరకూ ఈ దోమ కాటు నుండి బయట పడవచ్చు మరోవైపు ఇది ఎక్కువగా పగటి పూట యాక్టివ్ గా  ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దోమ కాటు నుండి దూరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి.

Published at : 18 Aug 2022 05:08 PM (IST) Tags: Dengue Symptoms Seasonal Fevers dengue cases Dengue Fevers in Karimnagar Karimnagar Latest News

సంబంధిత కథనాలు

ప్రైవేటు దవాఖానాల్లో నిబంధనల ఉల్లంఘన, అధికారుల నోటీసులు బేఖాతరు

ప్రైవేటు దవాఖానాల్లో నిబంధనల ఉల్లంఘన, అధికారుల నోటీసులు బేఖాతరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం, భయాందోళనలో ప్రజలు!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం, భయాందోళనలో ప్రజలు!

Karimnagar Kalotsavam : నేటి నుంచి మూడ్రోజుల పాటు కరీంనగర్ కళోత్సవాలు, 20 రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు

Karimnagar Kalotsavam : నేటి నుంచి మూడ్రోజుల పాటు కరీంనగర్ కళోత్సవాలు, 20 రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ తొలి సభ కరీంనగర్ లోనేనా? కారణం ఏంటంటే

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ తొలి సభ కరీంనగర్ లోనేనా? కారణం ఏంటంటే

కరీంనగర్ ప్రజావాణి - విన్నపాలు సరే, పరిష్కారం ఏదీ?

కరీంనగర్ ప్రజావాణి - విన్నపాలు సరే, పరిష్కారం ఏదీ?

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!