Bandi Sanjay Arrest: బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం.. ఎంపీ అని చూడకుండా ఇంత దారుణమా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
Jana Jagarana Deeksha: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం జారీచేసిన 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లో చేపట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తలుపులు బద్ధలుకొట్టి మరీ పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఆయనకు గాయమైనా ఎక్కడా తగ్గకుండా పోలీస్ వ్యాన్ లె ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
బండి సంజయ్ అరెస్టును కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన నియంత్రత్వాన్ని, ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అనే వ్యక్తి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు.. అయినా ఎంపీ కార్యాలయ గేట్లను విరగ్గొట్టి లోపలకు పోలీసులు వెళ్లడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు.
2/2
— G Kishan Reddy (@kishanreddybjp) January 2, 2022
Protests & dissent in support of people’s issues are an integral part of Democracy, as peoples representatives we strive for them.
ఎంపీ అనే కనీస గౌరవం లేకుండా ప్రోటోకాల్ ను కూడా ఉల్లంఘిస్తూ బండి సంజయ్‌ను దారుణమైన స్థితిలో అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఎంపీ బండి సంజయ్ చేస్తోంది ‘జాగరణ’ మాత్రమే. కోవిడ్19 నిబంధనలను పాటిస్తూ తన కార్యాలయంలో ‘జాగరణ’ చేస్తుంటే అడ్డుకోవడమా? మరి ఏ విధంగా నిరసన తెలపాలి?. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు ఇది విరుద్దం. నిరసన హక్కులను కాలరాయడమంటే రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: Shiva Parvathi Theatre: కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. శివపార్వతి థియేటర్ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తి నష్టం
వాళ్లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..
ఉద్యోగుల బదిలీల విషయంలో బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయాలని పోలీసులు వ్యవహరించిన తీరును హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. బీజేపీ పార్టీ ఆఫీసులో కూర్చుని నిరసన తెలిపడాన్ని కూడా అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ జాగరణ దీక్ష చేస్తుంటే.. వారిపై విచక్షణా రహితంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అమానుషమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని... ఉద్యోగుల కోసం చేస్తున్న ఆందోళనను అడ్డుకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్యానించారు.
Also Read: Karimnagar: కరీంనగర్ లో హైడ్రామా... బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం... అరెస్టు చేసిన పోలీసులు
Also Read: LB Nagar Youth Fight: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు