News
News
X

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

మూడ్రోజుల కిందట కరీంనగర్ లో చిన్నారి కిడ్నాప్ కేసు మరవక ముందే జగిత్యాల్లో మరో చిన్నారి కిడ్నాప్ కు గురైంది. ఆరు నెలల పాపను ఎత్తుకొచ్చి జనాలకు అడ్డంగా దొరికిపోయాడు.

FOLLOW US: 

Baby Missing: మూడు రోజుల కిందట కరీంనగర్‌లో చిన్నారి కిడ్నాప్ ఉదంతం మరవక ముందే జగిత్యాలలో అలాంటి సీనే మళ్లీ రిపీట్ అయింది. ఫుల్లుగా మద్యం తాగిన ఓ యువకుడు ఆరు నెలల ఓ పసి పాపను ఎత్తుకొచ్చి జగిత్యాల బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. విషయం గమనించిన స్థానిక ప్రజలు ఆ పాప ఎవరు, నువ్వెవరు అంటూ ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతడి వద్ద నుంచి పాపను తీస్కొని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చే లోపు అప్రమత్తమైన యువకుడు పాపను ఎత్తుకొని మళ్లీ పారిపోయాడు.

దీంతో మరోసారి వెతుకులాట మొదలు పెట్టారు. గంటలపాటు శ్రమించి నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్దనున్న పాపను స్థానిక సఖి కేంద్రం వద్దకు తరలించారు. సదరు యువకుడిని విచారించగా తాను నిర్మల్ జిల్లా మాదాపూర్‌కి చెందిన పోశెట్టి అని... భిక్షాటన చేస్తున్న ఓ యువతి వద్ద పాపని ఎత్తుకొచ్చినట్లు చెబుతున్నాడు. దీంతో పాప తల్లిదండ్రులు ఎవరో గుర్తించడానికి అటు పోలీసులు, ఇటు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే పాలు తాగే పసి వయసులో ఉన్న ఆ పాప తల్లి కోసం అమాయకంగా ఎదురు చూస్తూ ఉండడం అందర్నీ కలచివేసింది.

జిల్లాలో పసివాళ్లు మిస్సైన కేసులు ఏమైనా ఉన్నాయో అని వెరిఫై చేశారు. అలా చూసిన పోలీసులకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. ఓ మహిళ ఫిర్యాదు చేసిందని తెలుసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ పాప జగిత్యాలలో ఉన్నట్లు తెల్సుకున్న వాళ్లు.. తల్లితో సహా జగిత్యాల పోలీసుల వద్దకు వచ్చి సంప్రదించారు. అప్పటికే సమయం మించిపోవడంతో మళ్లీ పూర్తి ఆదేశాలతో రావాలంటూ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి తిరిగి ఆర్మూర్ తీసుకుని వెళ్లిపోయారు పోలీసులు. పూర్తి విచారణ తర్వాత పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.  

మొన్నటికి మొన్నే కరీంనగర్ లో...

ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో కరీంనగర్‌లో చిన్నారి కిడ్నాప్ జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసు ఉన్న పాపను అపహరించారు. పంద్రాగస్టు వేళ జరిగిన ఈ కిడ్నాప్ ఘటన కరీంనగర్ లో కలకలం సృష్టించింది. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సాంకేతిక సాయంతో ఈ కేసును ఛేదించారు. గంటల వ్యవధిలోనే ఆ చిన్నారిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. 

కిడ్నాప్ ఎలా జరిగింది?

మహమ్మద్ కుత్బోద్దీన్ మాంసం వ్యాపారం చేస్తూ కరీంనగర్ లోని అశోక్ నగర్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. ఇతనికి ఒకటిన్నర సంవత్సరాల పాప ఉంది. ఆగస్టు 15వ తేదీ 2022 రోజున సాయంత్రం 7 గంటల సమయంలో మహమ్మద్ కుత్బోద్దీన్ కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటుంది. కేరింతలు కొడుతూ బుడి బుడి అడుగులు వేస్తున్న ఆ చిన్నారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పాప కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికారు. అయినా వారికి చిన్నారి ఆచూకీ తెలియలేదు. పాప కోసం వెతుకుతున్న క్రమంలో ఓ ఆటో డ్రైవర్ ముందు చిన్నారిని కూర్చొబెట్టుకుని వెళ్తుండగా కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమాచారంతో పలు చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సుమారు తొమ్మిదిన్నర ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించారు.  రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడుని నాలుగు గంటల్లోపే పట్టుకున్నారు. 

Published at : 19 Aug 2022 06:07 PM (IST) Tags: Jagitial Latest News baby kidnap Baby Missing Jagitial Latest Crime News Kidnap Case In Jagitial

సంబంధిత కథనాలు

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Karimnagar Kalotsavam: కరీంనగర్‌లో తొలిసారి కళోత్సవాలు, ఘనంగా నిర్వహించాలని మంత్రి గంగుల ఆదేశాలు

Karimnagar Kalotsavam: కరీంనగర్‌లో తొలిసారి కళోత్సవాలు, ఘనంగా నిర్వహించాలని మంత్రి గంగుల ఆదేశాలు

Telangana ఎంసెట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ ఆప్ బెదిరింపులు, 10 వేలకు 45 వేలు కట్టినా వేధించడంతో !

Telangana ఎంసెట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ ఆప్ బెదిరింపులు, 10 వేలకు 45 వేలు కట్టినా వేధించడంతో !

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'