Kamareddy: కామారెడ్డి జిల్లాలో 40 కుటుంబాల కుల బహిష్కరణ... కలెక్టరేట్ ముందు బాధితుల నిరసన..!
కామారెడ్డి జిల్లాలో గుర్జాల్ తండాకు చెందిన 40 కుటుంబాలు తమను కుల బహిష్కరణ చేశారని కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. కుల బహిష్కరణ విధించిన సర్పంచ్, ఉపసర్పంచ్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రపంచం ఆధునికంగా దూసుకుపోతుంది. సాంకేతిక అభివృద్ధితో ఎన్నడూ ఊహించని కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అయినా ఇంకా కులబహిష్కరణ అనే జాడ్యాలు పోలేదు. ఇలాంటి ఘటనే తెలంగాణలో వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ తాండలో 40 కుటుంబాలు కుల బహిష్కరణకు గురయ్యాయి. తమను అకారణంగా కుల బహిష్కరణ చేశారని గుర్జాల్ తండా వాసులు కామారెడ్డి కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. 2006లో కూడా ఇలానే కుల బహిష్కరణ చేశారని తండా వాసుల ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ తమపై బహిష్కరణ వేటు వేసి మమ్మల్ని ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణకు గురిచేశారని ఆరోపిస్తున్నారు. సర్పంచ్, ఉప సర్పంచులను సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీని కలిసిన తండా వాసులు వినతిపత్రం అందజేశారు.
Also Read: తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్.. రేపు స్టాలిన్ తో భేటీ
2006లో కూడా ఇలాంటి ఘటనే
గ్రామ సర్పంచ్ దశరథ్ నాయక్, ఉప సర్పంచ్ జగదీష్, తండా నాయకులు కలిసి 40 కుటుంబాలను బహిష్కరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను గ్రామంలో ఎటువంటి కార్యక్రమానికి పిలవడం లేదన్నారు. 2006లో కూడా ఇలాగే బహిష్కరణ చేస్తే అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తండా వాసులు తెలిపారు. సర్పంచ్ అనుచరులతో తమకు ప్రాణ హాని ఉందన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి గుర్జాల్ తండా వాసులు ఫిర్యాదు చేశారు.
Also Read: కాళేశ్వరం ముంపు ప్రభావంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు... 8 వారాల్లో అధ్యయన నివేదిక ఇవ్వాలని ఆదేశం
Also Read: తెలంగాణలో బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి... లోక్ సభలో లేవనెత్తిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Also Read: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు
Also Read: Nagari Roja : నగరిలో రోజాకు "పంచ పాండవుల" కటీఫ్ .. మూడో సారి తప్పు చేయబోమని ప్రతిజ్ఞ !
Also Read: Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్... విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి