Kavitha: బీఆర్ఎస్ పింక్ బుక్ రెడీ - ఎంట్రీలు షురూ - అన్నీ తిరిగిచ్చేస్తామని కవిత హెచ్చరిక
Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. అన్నీ రాసుకుంటున్నామని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అన్నీ తిరిగి ఇస్తామని హెచ్చరించారు.

Kalvakuntla Kavitha announced that everything is being written in the pink book: బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల గురించి తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత .. కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. జనగాంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పింక్ బుక్ లో అన్ని రాసుకుంటున్నామని.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తామన్నారు. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు... మీ లెక్కలు తీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు..పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు... కానీ తెలంగాణ రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారని .. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం అని విమర్శించారు. కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి.. నిధులు పారాయని గుర్తు చేశారు.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001 లో ఆఘమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారని.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారన్నారు. 95 పూర్తయిన సమ్మక్క సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అని కవిత విమర్శించారు. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదని.. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు.
అవకాశవాదం కోసం కడియం శ్రీ హరి పార్టీ మారారని.. కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముందని.. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందని ప్రకటించారు. రూ 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోందని.. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లు మాయమయ్యాయన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని.. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం.. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థతి ఉందన్నారు. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడుతామని.. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

