Janasena in Telangana: తెలంగాణలోనూ జనసేన పోటీ, మొత్తం 32 చోట్ల - లిస్టు ఇదీ
జనసేన పోటీచేయబోయే స్థానాల లిస్టును కూడా జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి విడుదల చేశారు.

జనసేన పార్టీ తెలంగాణలోనూ పోటీకి రెడీ అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 32 చోట్ల పోటీ చేయనున్నట్లుగా పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించి స్థానాల లిస్టును కూడా జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యం అని జనసేన తెలంగాణ విభాగం వెల్లడించింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
జనసేన పోటీ చేసే 32 స్థానాలివే
కూకట్‌పల్లి, ఎల్బీనగర్, నాగర్‌కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్‌నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర తదితర చోట్ల పోటీ చేస్తున్నట్లుగా జనసేన అధికారికంగా ప్రకటించింది.
ఈ స్థానాల్లో పోటీ చేయడం ఫైనల్ అని ఒకవేళ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చివరిక్షణంలో పొత్తులు ఏవైనా ఉంటే ఆ స్థానాల్లో మార్పులు ఉండొచ్చని వెల్లడించింది. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తాము రెడీగా ఉన్నామని స్పష్టం చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

