Political Cheating : పార్టీలో చేరితే చాలు ఇల్లు, ఫ్లాట్లట - తీరా చేరిన తర్వాత !
పార్టీలో చేరితే ఇళ్లు ఫ్లాట్లు ఇస్తామని ఓ పార్టీ ఆశ చూపింది. అందే పెద్ద సంఖ్యలో జనం ఆ పార్టీ ఆఫీసు వద్దకు చేరారు. కానీ సభ్యత్వం కార్డు చేతిలో పెట్టి పంపేశారు.
Political Cheating : పార్టీలో చేరితే చాలు రూపాయి కూడా కట్టక్కర్లేదు ఇల్లు, ఫ్లాట్లు ఫ్రీ ! ఈ ఒక్క ఆఫర్ చాలదా జనం పెద్ద ఎత్తున పోలోమంటూ ఆ పార్టీలో చేరిపోవడానికి. ఇస్తారా లేదా అన్నది తర్వాత సంగతి రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ పార్టీలో చేరితే ఇస్తే ఇస్తారు ..లేకపోతే లేదు. ఇస్తే తీసుకుందాం.. లేకపోతే తిట్టుకుందాం.. పోయేదేముంది అనుకునే అమాయక పేదలు చాలా మంది ఉన్నారు. వారందర్నీ టార్గెట్ చేశారు కొంతమంది. జై మహాభారత పార్టీ పేరుతో సభ్యత్వాలు ప్రారంభించారు. ఆ పార్టీ ప్రతినిధులు బస్తీల్లో విస్తృత ప్రచారం చేశారు. అంతే.. పెద్ద ఎత్తున ఆ పార్టీ ఆఫీసు వద్దకు .. చేరిపోయారు.
"సరళ వాస్తు" చంద్రశేఖర్ గురూజీ హత్య - కర్ణాటకలో దారుణం !
పార్టీలో చేరితే చాలు 200 గజాల ఇండ్ల స్థలం వైకుంఠ ట్రస్ట్ ద్వారా ఇస్తామని పలు బస్తిల్లో జై మహాభారత పార్టీ ప్రచారం చేసింది. దీంతో మహిళలు సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని రవీంద్రభారతి ప్రక్కన ఓ ప్రైవేట్ భవనం ముందు భారీగా చేరుకున్నారు. వచ్చిన మహిళల దగ్గర ఒక అథార్ కార్డు,రెండు ఫోటోలు..కరెంట్ బిల్ తీసుకొని ఆ పార్టీ సభ్యత్వం రసీదు ఇచ్చి పంపిస్తున్నారు. అయితే వచ్చిన మహిళల్లో చాలా మంది వెంటనే స్తలం ఇస్తారని అనుకున్నారు.కానీ పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే ఇళ్ల స్థలాలు ఇస్తామని అదికూడా కొంతకాలం గడిచాక ఇస్తామని చెప్పుకొస్తున్నారు. దీంతో కొంతమంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కనిపించే "సమస్యలు పరిష్కరించే బాబా"ను సంప్రదించాడు - 38 లక్షలు పోగొట్టుకున్నాడు !
జై మహాభారత్ పార్టీ ఆఫీస్ వద్ద రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సమీపంలో డీజీపీ ఆఫీసు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అటుగా వెళ్తున్న వాహనదారులు మండిపడుతున్నారు. అమాయక పార్టీలను మోసం చేస్తున్న జై భారత్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. అసలుఈ జై మహా భారత్ పార్టీ అధినేత ఎవరు..? ఎందుకు ఆధార్ కార్డులు, ఫోటోలు సేకరిస్తున్నారన్న దానిపై పోలీసులు కూడా ఇంత వరకూ కనీస సమాచారం తెలుసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నమ్మకంతో ఆశ్రయం ఇస్తే ఆశ్రమంలోనే స్వామీజీ హత్య - కరీంనగర్ జిల్లాలో కలకలం
అయితే తాము ఇళ్లు, ఫ్లాట్లు ఇస్తామని చెప్పలేదని ఆ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రైవేటుగా మాత్రం సభ్యత్వం తీసుకునేవారికి చెబుతున్నారు. ఆ పార్టీకి చెందిన వారు భక్తుల్లా డ్రెస్ చేసుకుని తిరుగుతూండటంతో వారితో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ప్రజల వద్ద అధికారికంగా రూపాయికూడా వసూలు చేయడం లేదు. కానీ పార్టీ పేరుతో కొంత మంది వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.