News
News
X

Saral Vastu Chandrashekhar Guruji : "సరళ వాస్తు" చంద్రశేఖర్ గురూజీ హత్య - కర్ణాటకలో దారుణం !

కర్ణాటకలో సరళ వాస్తు పండితుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు నిందతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

FOLLOW US: 

Saral Vastu Chandrashekhar Guruji : కర్ణాటకలో వాస్తు నిపుణుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర గురూజీ దారుణ హత్యకు గురయ్యారు. హుబ్బళ్లిలోని ఓ హోటల్‌లో ఆయన బస చేశారు. హోటల్ రిసెప్షన్‌లో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు ఆయనతో గొడవపడి కత్తితో పొడిచారు. ఆ తర్వాత పరారయ్యారు. వెంటనే హోటల్ లో ఉన్న వారు చంద్రశేకర గురూజీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయిందని... ఆయన చనిపోయారని డాక్టర్లు తేల్చారు. పోలీసులు వెంటనే సీసీ టీవీ ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించారు. అయితే వారు చంద్రశేఖర్ గురూజీని కత్తి పొడిచి పారిపోయారు. 

సోషల్ మీడియాలో కనిపించే "సమస్యలు పరిష్కరించే బాబా"ను సంప్రదించాడు - 38 లక్షలు పోగొట్టుకున్నాడు !

వారి ఫోన్ నెట్వర్క్‌లను ట్రేస్ చేసిన పోలీసులు బెళగావి జిల్లాలో ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. హుబ్బళ్లికి తరలించి ఎందుకు చంద్రశేఖర్ గురూజీని చంపాల్సి వచ్చిందో  ఇంటరాగేట్ చేస్తున్నారు. హోటల్‌లో బస చేస్తున్న సమయంలో కొంత మంది వ్యక్తులు రిసెప్షన్‌కు వచ్చి ఆయనను కలవాలని కోరారని.. ఆ మేరకు రిసెప్షన్‌ను రూమ్‌కు కాల్ చేయడంతో ఆయన తనను కలిసేందుకు వచ్చిన వారి కోసం కిందకు వచ్చారు. వారితో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా కత్తి తీసి పొడిచేశారని హుబ్బళ్లి పోలీస్ కమిషనర్ ప్రకటించారు. 

అల్లుడి అంతం కోసం 4.5 లక్షలకు సుపారీ, హత్య తర్వాత దూరంగా ఎడమకాలు! వెలుగులోకి కీలక విషయాలు

హత్య గురించి తెలిసిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హుబ్బళ్లి పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. చంద్రశేఖర్ గురూజీని చంపడం అత్యంత కిరాతకమని మండిపడ్డారు హంతకులను తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించారు. 

మాట్రిమోని సైట్ లో అమ్మాయిలా ఫేక్ ప్రొఫైల్, లక్షల్లో సమర్పించుకున్న బాధితులు!

సరళ వాస్తులో దిట్టగా పేరు పొందిన చంద్రశేకర్ గురుజీని మానవ్‌గురుగా కూడా పిలుస్తూంటారు. బాగల్‌కోట్ జిల్లాలో పుట్టిన చంద్రశేఖర్ కాంట్రాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఆయన ముంబైలో ఉద్యోగం తెచ్చుకుని అక్కడికి మారారు. అక్కడే వాస్తు సలహాల బిజినెస్ ప్రారంభించారు. ఆయన చెప్పిన వాస్తు సలహాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముంబైలో ఉంటున్న ఆయన బంధువు కుటుంబంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హుబ్బళ్లి వచ్చారు. ఈ విషయం తెలిసే హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. అసలు హత్యకు కారణాలేమిటన్నదానిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. 

Published at : 05 Jul 2022 05:50 PM (IST) Tags: Karnataka news Chandrasekhara Guruji Murder Sarla Vastu Chandrasekhar Murder Karnataka Murder

సంబంధిత కథనాలు

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్

Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్

Machilipatnam Crime News : మచిలీపట్నంలో దారుణం, పోలీసులమని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం

Machilipatnam Crime News : మచిలీపట్నంలో దారుణం, పోలీసులమని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

Video Call Suicide: భార్యకు భర్త వీడియో కాల్, వెంటనే దూలానికి ఉరి! కారణం తెలిసి పోలీసులు షాక్

Video Call Suicide: భార్యకు భర్త వీడియో కాల్, వెంటనే దూలానికి ఉరి! కారణం తెలిసి పోలీసులు షాక్

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన