అన్వేషించండి

Jagga Reddy : కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు పార్టీ కార్యక్రమాల సమాచారం ఉండటం లేదన్నారు. కాంగ్రెస్‌లో ఎవరూ హీరో ఉండరని మండిపడ్డారు.


తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారు తమ స్వరాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా సీనియర్లు తమకు పార్టీ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో సమాచారం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో ఒకరయిన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు  వచ్చిన ఆయన శాసనసభ ప్రాంగణంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆవేశంతో ఊగిపోయారు. పీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పించారు.  రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడానికి ముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానన్నారు. కాంగ్రెస్ పార్టీనా.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని విమర్శించారు.
Jagga Reddy : కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !

Also Read : ఖమ్మంలో అమానవీయం.. చితిపై కూర్చొని నిరసన, అంత్యక్రియలు వద్దని స్థానికుల డిమాండ్

ఇటీవల టీ పీసీసీ రెండు నెలల పోరాట కార్యాచరణను ప్రకటించింది. అయితే  వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండా చర్చ లేకుండా ఎలా ఖరారు చేశారని ఆయన ఫీలయ్యారు. అందుకే పార్టీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీగా మారిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వర్సెస్ అజహరుద్దీన్ అంటూ క్రికెట్ మ్యాచ్‌ను జహీరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్ గురించి గీతారెడ్డికి కనీసం సమాచారం ఇవ్వలేదని.. మండిపడ్డారు. అంతే కాదు.. సంగారెడ్డి జిల్లాలో పర్యటించినా... తనకు కూడా సమాచారం ఇవ్వడం లేదన్నారు. కనీసం ప్రోటో కాల్ పాటించాలి కదా అని ఆయన విమర్శించారు. తనతో వివాదం ఉందని రేవంత్ రెడ్డి చెప్పాలనుకుంటున్నారని అందుకే సమాచారం ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ లో ఏ ఒక్కరో హీరో కాలేరని ఆయన మండిపడ్డారు.
Jagga Reddy : కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !

Also Read : ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారు తల్లి" ఏమయింది ?

టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత చురుగ్గా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే రేవంత్ దూకుడు పార్టీ సీనియర్లకు నచ్చడం లేదు. తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండటం లేదని.. తమకు స్థాయికి తగ్గ గౌరవం దక్కడం లేదని మరికొందరు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇక పార్టీని ఇబ్బంది పెట్టే ప్రకటనలు కూడా తరచూ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తరచూ చర్చకు వస్తున్నాయి.
Jagga Reddy : కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !

Also Read : ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’తో అదిరిపోయే మీమ్, Hyd పోలీసులు ట్వీట్.. పగలబడి నవ్వుతున్న నెటిజన్లు

అయితే ఇటీవల ఏఐసిసి తెలంగాణకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ నియమించింది. ఆ కమిటీ నిర్ణయం మేరకు రెండు నెలల కార్యక్రమాలు రూపొందించారని అందులో రేవంత్ రెడ్డి ఒక్కరి నిర్ణయం ఏమీ లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అది ఎప్పుడూ ఉండేదని సమాచారం అందినా ఏదో ఓ వంకతో అసంతృప్తి వ్యక్తం చేస్తారన్న అభిప్రాయం రేవంత్ వర్గీయుల్లో ఉంది. జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో సీనియర్లకు రేవంత్‌కు మధ్య దూరం పెరుగుతోందని మరోసారి తేల్చినట్లయింది.

Also Read : 8 ఏళ్ల బాలికకి గట్టిగా ముద్దు పెట్టేసిన బాలుడు.. కారణం తెలిసి పోలీసుల దిమ్మతిరిగింది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget